SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఇండియన్ ఆర్మీ చేతిలో ఖతమ్..పీర్ పంజాల్‌ను భయపెట్టిన హషీమ్ మూసా బ్యాక్‌గ్రౌండ్ వింటే షాక్ అవ్వాల్సిందే..!!

Hashim Musa: ఇండియన్ ఆర్మీ ఒక భారీ విజయాన్ని సాధించింది. జమ్మూకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమయ్యాడు.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Sep 30, 2026, 11:51 AM IST | Updated: Sep 30, 2026, 11:53 AM IST
Image Credit: Hashim Musa
Join

Hashim Musa: ఇండియన్ ఆర్మీ ఒక భారీ విజయాన్ని సాధించింది. జమ్మూకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమయ్యాడు. ఖాన్సాహిబ్ లోని పలమేదని ముగ్ పతారీ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. హతమైన ఉగ్రవాదిని లష్కర్ ఏ తైబా అగ్ర కమాండర్ అయిన హషిమ్ మూసాగా గుర్తించాయి భద్రతా బలగాలు. ఆ ప్రాంతంలో మరికొంతమంది ఉగ్రవాదులు ఉండే అవకాశాలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా సెప్టెంబర్ నెలలో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత సైన్యం. ఈ ఎన్ కౌంటర్ కు ఆపరేషన్ కోరగ్ అని పేరు పెట్టింది సైన్యం.  జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించాయి.

ఎవరీ హషీమ్ మూసా?
ఎవరీ హషీమ్ మూసా..అంటే భద్రతా వర్గాలు ఫౌజీ అనే పేరుతో పిలుస్తుంటాయి. అతని రూపం.. పాకిస్తాన్ సైన్యం లేదంటే దాన్ని ఎలైట్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ తరహాలో కఠిన ట్రైనింగ్ పొందడమే దీనికి కారణం. పీవోకేకు చెందిన మూసా తండ్రి గతంలో పాక్ సైన్యంలో విధులు నిర్వహించాడు. ఈ నేపథ్యం..అతని సైనిక తరహా ట్రైనింగ్ కారణంగా ఏజెన్సీలు మూసాను అత్యంత ప్రమాదకరమైన విదేశీ టెర్రరిస్టుగా గుర్తించాయి.

పహల్గామ్ ఉగ్రదాడి విచారణలో తొలిసారిగా మూసా పేరు వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచీ భద్రతా బలగాలు అతనిపై నిఘా పెట్టాయి. 2023 డిసెంబర్ లో జరిగిన డేరాకీ గలీ ఆకస్మిక దాడి.. 2024 మే నెలలో పూంచ్ లో ఐఏఎఫ్ కాన్వాయ్ పై దాడి, 2024 అక్టోబర్ లో గుల్మార్గ్ సమీపంలోని బోటా ప్రతి దాడి వెనక మూసా గ్రూప్ హస్తం ఉందని ఏజెన్సీలు నిర్ధారణకు వచ్చాయి. జమ్మూను కాశ్మీర్ లోయతో కలిపే పీర్ పంజాల్ పర్వత శ్రేణులను తన కార్యకలాపాలకు అడ్డగా మార్చుకుని.. ఈ దట్టమైన అడవీ, పర్వత ప్రాంతంలో టెర్రరిస్టు కదలికలను గుర్తించడం చాలా కష్టం అవ్వడంతో చాలా కాలం పాటు తప్పించుకుని తిరిగాడు.

పిర్ పంజాల్ ప్రాంతంలో చురుకుగా ఉన్న లష్కర్-ఎ-తైబా గ్రూపులో మూసా ఒక కీలక సభ్యుడు. ఈ గ్రూపులో యాసిర్, జునైద్ అహ్మద్ భట్,   సులేమాన్ షా కూడా ఉన్నారు. గంగన్ గిర్ టన్నెల్ దాడికి సూత్రధారి అయిన జునైద్, డిసెంబర్ 2024లో,  సులేమాన్ షా జూలై 2025లో వేర్వేరు ఆపరేషన్లలో భద్రతా దళాల చేతిలో హతమయ్యారు.

మూసాకు అత్యంత సన్నిహితుడైన యాసిర్, ఈ నెల 5వ తేదీన యుస్మార్గ్‌లోని ఎత్తైన ప్రాంతాలలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. యాసిర్ మరణంతో, మిగిలిన ఏకైక వ్యక్తి అయిన మూసా కోసం భద్రతా దళాలు గాలింపును ముమ్మరం చేశాయి. అతని కదలికల గురించి అందిన తాజా సమాచారం ఆధారంగా, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టగా, మూసా హతమయ్యాడు. దీంతో, పిర్ పంజాల్ ప్రాంతంలో చాలా కాలంగా చురుకుగా ఉన్న ఈ లష్కర్-ఎ-తైబా గ్రూపు కథ పూర్తిగా ముగిసిందని చెప్పాలి. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES