SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కోల్‌కతా - ముంబై ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేస్తామంటూ వార్నింగ్..!

Hijack Threat: పశ్చిమ బంగాల్ రాజధాని కోల్‌కతా నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైకు ప్రయాణిస్తున్న విమానానికి హైజాక్ బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్ ఇండియాకు చెందిన AI 2772 (కోల్‌కతా - ముంబై) విమానం టేకాఫ్ అయ్యే సమయంలో వచ్చిన కాల్‌తో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 11, 2026, 01:46 PM IST | Updated: Nov 11, 2026, 01:51 PM IST
Image Credit: Kolkata - Mumbai Hijjack (AI/Source)
Join

Plane Hijack News: A320 రకానికి చెందిన VT-TNH విమానం ఉదయం 10:20 గంటలకు కోల్ కతా నుంచి ముంబై బయలుదేరాల్సి ఉంది.విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతూ హోల్డింగ్ పాయింట్ వద్ద ఉన్న సమయంలో.. విమానంలోని టాయిలెట్‌లో హైజాక్ బెదిరింపు లేఖను అక్కడి సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు.

హైజాక్ నేపథ్యంలో భద్రతా దళాల అప్రమత్తత.. 

వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది వెంటనే ఈ విమానాన్ని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్లో ఉన్న ఐసోలేషన్ బేకు తరలించారు. ఈ విమానంలో మొత్తం 108 మంది ఉన్నారు. అందులో విమాన సిబ్బంది 5 మెంబర్స్ ఉన్నారు. ప్రయాణికులు 93 మంది.. ఇతర సిబ్బంది 10 వరకు ఉన్నట్టు సమాచారం. హైజాక్ వార్తల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అప్రమత్తం చేశారు.

గతంలో జరిగిన విమాన హైజాకులు.. 

గతంలో దేశ వ్యాప్తంగా పలు సందర్భాల్లో విమానం ప్రయాణం చేసే సమయంలో హైజాక్ అయిన సందర్భాలున్నాయి. తొలిసారి జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ 1971లో శ్రీనగర్ జమ్మూలో 30 జనవరి విమానాన్ని హైజాక్ చేశారు. 1976లో  సెప్టెంబర్ 10న ఢిల్లీ - ముంబై  విమాన హైజాక్ పెద్ద సంచలనే సృష్టించింది. 20 డిసెంబర్ 1978లో కోల్‌కతా - ఢిల్లీ ఎయిరోప్లేన్‌ను హైజాక్ చేశారు. ఆ తర్వాత 1980, 1982, 1984,1986, 1993లో ప్లెయిన్ హైజాక్ ఘటనలు జరిగాయి. ఇక డిసెంబర్ 24 1999లో ఖాఠ్మండూ నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫైట్ 814 విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లిన ఘటన ఎవరు మరవలేరు. ప్రయాణికుల రక్షణ మొదటి బాధ్యతగా ప్రభుత్వం టెర్రరిస్టుల డిమాండ్‌కు తలొగ్గి మన దేశంలో ఉంటున్న హర్కతుల్ ముజాహిద్దీన్‌కు టెర్రరిస్టులైన మసూద్ అజహర్‌ను భారత ప్రభుత్వం విడిచిపెట్టాల్సి వచ్చింది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES