• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Govt Employees Holiday: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌.. 14వ తేదీన సెలవు

Govt Employees Holiday: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌.. 14వ తేదీన సెలవు

November 14th Govt Employees Holiday In Andhra Pradesh Here Full Details: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ప్రకటన. రెండో శనివారం సెలవుకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రెండో శనివారం సెలవును ఉద్యోగులు వాడుకోవచ్చని స్పష్టం చేసింది. గతంలో రెండో శనివారం సెలవును పనిదినంగా ప్రకటించగా.. దానిని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Written By Ravi Kumar Sargam
Published: Nov 11, 2026, 03:54 PM IST|Updated: Nov 11, 2026, 04:09 PM IST
joinshare
Govt Employees Holiday: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌.. 14వ తేదీన సెలవు
Image Credit: AP Govt Employees Holiday

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
వర్కింగ్ మదర్స్, ఉమెన్స్ కోసం స్పెషల్ హెల్త్ టిప్.. బార్లీ పాయసంతో మానసిక ఒత్తిడికి చెక్..!!

వర్కింగ్ మదర్స్, ఉమెన్స్ కోసం స్పెషల్ హెల్త్ టిప్.. బార్లీ పాయసంతో మానసిక ఒత్తిడికి చెక్..!!

2

అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు.. చివరకు పెళ్లి.. ఆ తర్వాత మరో ట్విస్ట్!

3

ఇవ్వడానికి ఏం లేదు.. విద్యను మాత్రమే అందించగలను: సీఎం రేవంత్

4

ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!

5

గ్రామస్తులకు అడ్డంగా దొరికిన మైనర్ జంట.. పంచాయితీలో వారు ఏం చేశారంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Govt Employees Holiday: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన సమాచారం ఇది. ఈనెల 14వ తేదీన సెలవు వచ్చేసింది. రెండో శనివారం సెలవు వినియోగంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వాస్తవంగా రానున్న రెండో శనివారం పనిదినంగా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన సెలవును సద్వినియోగం చేసుకోని ఉద్యోగులు రెండో శనివారం సెలవును యథావిధిగా వినియోగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ శనివారం వాడుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.

దసరా పండుగ సందర్భంగా 19-10-2026న సాధారణ సెలవు ప్రకటించినప్పటికీ ఎన్నికలు, దసరా పండుగ, సరాస్‌ (విజయవాడ దసరా ఉత్సవాలు) ఫెస్టివల్ తదితర వాటివి ఉండడంతో ఉద్యోగులు ఆ రోజు విధులు నిర్వహించారు. కొందరు ఉద్యోగులు సెలవు వినియోగించుకోగా.. చాలా మంది సెలవు వినియోగించుకోకుండా విధుల్లో పాల్గొన్నారు. దీంతో ఆ రోజు సెలవు పొందలేని ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఆ రోజు సెలవు వినియోగించుకోని ఉద్యోగులకు రానున్న రెండో శనివారం సెలవు వాడుకోవచ్చని తెలిపింది.

ఈనెల 14వ తేదీ రెండో శనివారం సెలవు పొందేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 19వ తేదీన విధులు నిర్వహించిన ఉద్యోగులు అందరూ రానున్న రెండో శనివారం సెలవు పొందవచ్చని ఆదేశాల్లో పేర్కొంది. సంబంధిత ఉద్యోగుల విధుల వివరాలను అధికారుల ద్వారా ధృవీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఆరోజు సెలవు పొందిన ఉద్యోగులందరూ 14వ తేదీన రెండో శనివారం రోజు యథావిధిగా విధులకు హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది అందరికీ వర్తించే సాధారణ సెలవు కాదని ప్రకటించింది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాలు జరిగిన విషయం తెలిసిందే. మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున విధుల్లో పాల్గొన్నారు. దీనికితోడు దసరా సందర్భంగా విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సరస్‌ ఫెస్టివల్‌కు పెద్ద ఎత్తున ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. అలాంటి ఉద్యోగులందరూ కూడా రెండో శనివారం సెలవు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Employees
Andhra Pradesh
AP News
Trending News