• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. కోర్టులో హాజరుపరచాలని సీపీకి ఆదేశాలు..!!

మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. కోర్టులో హాజరుపరచాలని సీపీకి ఆదేశాలు..!!

High Court: ప్రభుత్వ భూముల వ్యవహారంలో కలెక్టర్లపై హైకోర్టుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకున్న కోర్టు.. నేడు మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టర్ మనూ చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ ను వెంటనే కోర్టులో హాజరు పర్చాలని సీపీని ఆదేశించింది. అసలేం జరిగిందంటే..

Written ByBhoomi
Published: Nov 11, 2026, 03:57 PM IST|Updated: Nov 11, 2026, 03:59 PM IST
joinshare
మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. కోర్టులో హాజరుపరచాలని సీపీకి ఆదేశాలు..!!
Image Credit: High Court

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
వర్కింగ్ మదర్స్, ఉమెన్స్ కోసం స్పెషల్ హెల్త్ టిప్.. బార్లీ పాయసంతో మానసిక ఒత్తిడికి చెక్..!!

వర్కింగ్ మదర్స్, ఉమెన్స్ కోసం స్పెషల్ హెల్త్ టిప్.. బార్లీ పాయసంతో మానసిక ఒత్తిడికి చెక్..!!

2

అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు.. చివరకు పెళ్లి.. ఆ తర్వాత మరో ట్విస్ట్!

3

ఇవ్వడానికి ఏం లేదు.. విద్యను మాత్రమే అందించగలను: సీఎం రేవంత్

4

ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!

5

గ్రామస్తులకు అడ్డంగా దొరికిన మైనర్ జంట.. పంచాయితీలో వారు ఏం చేశారంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

High Court: ప్రభుత్వ భూముల వ్యవహారంలో కలెక్టర్లపై హైకోర్టుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకున్న కోర్టు..  నేడు మేడ్చల్ మల్కాజ్ గిరి  కలెక్టర్ మనూ చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ ను వెంటనే కోర్టులో హాజరు పర్చాలని సీపీని ఆదేశించింది. అసలేం జరిగిందంటే..

ప్రభుత్వ భూముల వ్యవహారంలో..  కోర్టు ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తెలంగాణ హైకోర్టు ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో..  కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమవ్వడమే కాకుండా, విచారణకు హాజరుకాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ను నేరుగా కోర్టులో హాజరుపరచాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల కాలంలో న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను ధిక్కరించిన కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే ఇప్పుడు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌పై కూడా జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విధంగా సీరియస్ కావడంతో ప్రభుత్వ యంత్రాగంలో తీవ్ర కలకలం రేగింది.

న్యాయస్థాన ఆదేశాలను బేఖాతరు చేసే అధికారులపై ఉక్కుపాదం మోపుతుండటంతో ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగానూ, అధికార వర్గాల్లోనూ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ.. కోర్టు ధిక్కరణ కేసులపై హైకోర్టు అనుసరిస్తున్న ఈ కఠిన వైఖరి అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది.

Also Read: 

వైట్‌కాలర్‌ ఉద్యోగాలకు AI పెద్ద ముప్పు.. బ్లూకాలర్‌కే ఢోకా లేదు: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Supreme Court
Telugu News