SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Uttar Pradesh: కర్వాచౌత్ రోజు ప్రియుడి ఇంటికి వివాహిత.. ఆ పనిచేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. వీడియో వైరల్..

Mathura woman affair on karva chauth: వివాహిత తన భర్తను వదిలి ప్రియుడిని కర్వాచౌత్ రోజు కలుద్దామని వెళ్లింది. ఆమె వెనకాలే వెళ్లిన భర్త భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. యూపీలో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 30, 2026, 01:56 PM IST | Updated: Oct 30, 2026, 02:07 PM IST
Image Credit: mathura woman affair on karva chauth video
Join

Husband catches his wife red handed on karva Chauth in Mathura: సమాజంలో కొంత మంది మరీ దిగజారీ ప్రవర్తిస్తున్నారు. వివాహేతర  సంబంధాలో మోజులో పడి కట్టుకున్న వారిని కాటికి పంపిస్తున్నారు. భార్యభర్తలు ఒకర్ని మరోకరు హత్యలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. కొన్ని చోట్ల భార్యలు తమ భర్తల్ని చంపితే, మరికొన్ని చోట్ల భర్తలు తమ భార్యల్ని చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. పెళ్లై, పిల్లలున్న కూడా కొంత మంది వివాహేతర సంబంధాల మోజులో పడి నీచంగా ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే సమాజం అసలు ఎటుపోతుందని ఆశ్చర్యం వేస్తుంది. ఈక్రమంలో యూపీలోని మథురలో చోటు చేసుకున్న ఘటన వార్తలలో నిలిచింది.

 

 

ఉత్తర  ప్రదేశ్ లోని మథుర లో స్థానికంగా కర్వాచౌత్ పండగ వేళ దారుణం వెలుగులోకి వచ్చింది. కర్వా చౌత్ రోజున, వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటూ చంద్రుడిని చూసి పూజలు చేస్తారు. ఆతర్వాత తమ భర్త ముఖం చూస్తారు. దీని వల్ల భర్తకు మంచి జరుగుతుందని భావిస్తారు.  థానా హైవే ప్రాంతంలోని బసంత్ విహార్ కాలనీలో మనోజ్, అంజులు ఉంటున్నారు . వీరికి పెళ్లై 15 ఏళ్లు అవుతుంది. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. 

అయితే అంజుకు ఇటీవల సంజయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరు తరచుగా కలుసుకునే వారు. ఇటీవల ఈ విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. అంజు మాత్రం ప్రియుడితోనే ఉంటానని, తనకు ఆస్తిలో సగం ఇవ్వాలని  కోర్టులో కేసు కూడా వేసింది. దీనిపై విచారణ జరుగుతుంది. ఈక్రమంలో కర్వాచౌత్ రోజు ప్రియుడు సంజయ్ ఇంటికి అంజు వెళ్లింది. నలుగురు పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్లింది.

 ఆమె వెంట భర్త, అతని కుటుంబ సభ్యులు వెళ్లారు. అంజును ప్రియుడితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. అంజు, అతని ప్రియుడు సంజయ్ పై భర్త దాడి చేశారు. ఈ ఘటనతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES