SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రూ.69,999తో Infinix GT 50 Pro లాంచ్.. 24 వేల విలువైన గేమింగ్ యాక్సెసరీస్ ఫ్రీగా!

Infinix Gt 50 Pro Launched In India: ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇన్ఫినిక్స్ GT 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ గేమింగ్‌ మొబైల్‌గా పరిచయం చేసింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ పరంగా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 30, 2026, 05:24 PM IST | Updated: Oct 30, 2026, 05:26 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Infinix Gt 50 Pro Launched In India: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ మార్కెట్‌లోకి అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. దీనిని కంపెనీ ఇన్ఫినిక్స్ GT 50 ప్రో పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన, శక్తివంతమైన ప్రాసెసర్‌తో లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇన్ఫినిక్స్ GT 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది.. అంతేకాకుండా మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌ను కలిగి ఉంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇన్ఫినిక్స్ GT 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. ఇందులో కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ 6,500 mAh బ్యాటరీని కూడా అందించింది.. ఇన్ఫినిక్స్ GT 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, అదనంగా 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా లభిస్తోంది..

ఈ ఇన్ఫినిక్స్ GT 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ వివిధ రకాల స్టోరేజ్‌ వేరియంట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 12 GB ర్యామ్‌, 256 GB స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది ధర రూ.69,999తో లభిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడే దీనిని వివిధ ఈ కామర్స్‌ కంపెనీ వెబ్‌సైట్స్‌లో కొనుగోలు చేసేవారికి క్రెడిట్ కార్డుతో EMI ఆప్షన్‌ వినియోగించుకునేవారికి అద్భుతమైన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి 10 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది..

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి ఇన్ఫినిక్స్ రూ.24,999 వరకు GT 50 ప్రో గేమింగ్ ఎకోసిస్టమ్‌ను ఫ్రీగా అందిస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్ బ్లేజ్‌తో పాటు బ్లాక్ అబిస్ కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.. ఇన్ఫినిక్స్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కొనుగోలు చేయోచ్చు..

ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో లబిస్తోంది. అంతేకాకుండా 6.78-అంగుళాల LTPS AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే ఎంతో శక్తివంతమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొక్షన్‌తో లభిస్తోంది. గేమింగ్ సమయంలో ప్రత్యేకమైన గ్రిప్‌ కోసం ఇందులో ప్రెజర్-సెన్సిటివ్ GT ట్రిగ్గర్ బటన్లు కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. దీనికి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్‌సెట్ ప్రాసెసర్‌పై కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఇన్ఫినిక్స్ GT 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో కంపెనీ 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు చాలా ప్రత్యేకమైన 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలను అందించింది. వీడియో కాల్స్ కోసం 13-మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఇది ఎంతో ప్రత్యేకమైన 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పాటు 6,500mAh బ్యాటరీతో లభిస్తోంది..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES