DA July Hike Credited News: పెరుగుతున్న ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించేందుకు 7వ వేతన సంఘం (7th CPC) సిఫార్సులు, లెక్కింపు విధానం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డీఏను సవరించింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల నెలవారీ వేతనంలో మూల వేతనం (బేసిక్ పే) ఆధారంగా అదనపు ఆదాయం తోడవుతుంది.
వివిధ బేసిక్ శాలరీల ఆధారంగా పెరిగే డీఏ, 4 నెలల ఎరియర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
రూ. 18,000 బేసిక్ శాలరీ ఉన్న వారికి గతంలో 60% డీఏతో రూ. 10,800 రాగా, 63% పెంపుతో ఇది రూ. 11,340కి పెరుగుతుంది. దీనివల్ల నెలకు రూ. 540 అదనంగా రాగా, 4 నెలల బకాయిల రూపంలో రూ. 2,160 అందుతాయి.
రూ. 25,500 బేసిక్ శాలరీ ఉన్న వారికీ.. 60% డీఏతో రూ. 15,300 లభించగా, 63% డీఏతో అది రూ. 16,065కి పెరుగుతుంది. నెలకు రూ. 765 అదనపు లబ్ధితో పాటు, 4 నెలల బకాయిలు రూ. 3,060 అకౌంట్లో జమ కానున్నాయి.
రూ. 29,200 మూల వేతనం కలిగిన ఉద్యోగులకు గతంలో రూ. 17,520 ఉండగా, నూతన పెంపుతో రూ. 18,396 లభిస్తుంది. నెలకు రూ. 876 అదనంగా రానుండగా.. 4 నెలల బకాయిలు రూ. 3,504 డబ్బు చేతికి అందనుంది.
రూ. 44,900 మూల వేతనం కలిగిన ఉద్యోగులకు 60% డీఏతో రూ. 26,940 రానుంది. 63% పెంపుతో అది రూ. 28,287కి కొత్త డీఏ చేరుతుంది. నెలకు రూ. 1,347 అదనపు లబ్ధితో పాటు 4 నెలల బకాయిలు రూ. 5,388 చేతికి అందనున్నాయి.
అలాగే రూ. 56,100 బేసిక్ శాలరీ కలిగిన ఉద్యోగులకు గతంలో రూ. 33,660 రాగా.. ఈ సరికొత్త డీఏ పెంపు 63 శాతంతో రూ. 35,343 లభించనుంది. ఈ విధంగా నెలకు రూ. 1,683 అదనంగా రాగా, 4 నెలల బకాయిలుగా రూ. 6,732 ఉద్యోగికి అందనున్నాయి.
మూల వేతనాన్ని బట్టి ఉద్యోగులకు అందే బకాయిలు రూ. 2,160 నుండి రూ. 6,732 వరకు ఉంటాయి. ఇవి కేవలం డీఏ పెంపు అంచనా లెక్కలని, పేరోల్ సర్దుబాట్లను బట్టి చేతికి అందే మొత్తం మారవచ్చని గమనించాలి. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 10,016.10 కోట్ల అదనపు భారం పడనుంది. అలాగే పెన్షనర్లకు కూడా డీఆర్ పెంపుతో సమానంగా ప్రయోజనం చేకూరుతోంది.