• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /IRCTC Current Booking: రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలా? ఛార్ట్ ప్రిపేర్ అయ్యాక కూడా ఛాన్స్ ఉంది! ఎలాగంటే?

IRCTC Current Booking: రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలా? ఛార్ట్ ప్రిపేర్ అయ్యాక కూడా ఛాన్స్ ఉంది! ఎలాగంటే?

IRCTC Current Booking Option: సాధారణంగా మొదటి రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన వెంటనే రైలు టికెట్ల బుకింగ్ ప్రక్రియ ముగిసిపోయిందని ప్రయాణికులు భావిస్తుంటారు. అయితే ఖాళీగా ఉన్న బెర్తులు లేదా రద్దయిన సీట్ల కోసం రైల్వే శాఖ 'కరెంట్ బుకింగ్' సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. దీని ద్వారా ప్రయాణికులు చివరి నిమిషంలో కూడా కన్ఫర్మ్ టికెట్లను పొందే వెసులుబాటు కలదు. ఇటీవల మొదటి, తుది రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాల్లో కూడా రైల్వే శాఖ పలు కీలక మార్పులు చేపట్టింది.

Written ByHarish Darla
Published: Oct 03, 2026, 01:45 PM IST|Updated: Oct 03, 2026, 02:22 PM IST
joinshare
IRCTC Current Booking: రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలా? ఛార్ట్ ప్రిపేర్ అయ్యాక కూడా ఛాన్స్ ఉంది! ఎలాగంటే?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
NTR: చుట్టమల్లే AI వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. ఇక ఊరుకునేది లేదంటూ వార్నింగ్

NTR: చుట్టమల్లే AI వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. ఇక ఊరుకునేది లేదంటూ వార్నింగ్

2

దసరా, సద్దుల బతుకమ్మ ఎప్పుడంటే? పండితులు ప్రకటించిన పండుగ వివరాలు!

3

Nayara Petrol Hike: ఇంధన వినియోగదారులకు పిడుగు లాంటి వార్త..పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 నయారా పెంపు!

4

Dharmapuri: మంత్రి నియోజకవర్గంలోనే కరెంట్ కష్టాలు.. రైతులు, గ్రామస్థుల ధర్నా!

5

Ind Vs Pak Final Highlights: హైవోల్టేజ్ పోరులో పాక్‌పై విక్టరీ.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IRCTC Current Booking Option: రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి మొదటి రిజర్వేషన్ చార్ట్ విడుదలైన తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందే వెసులుబాటు అందుబాటులో ఉంది. రైలులో సీట్లు లేదా బెర్తులు ఖాళీగా ఉంటే 'కరెంట్ బుకింగ్' విధానం ద్వారా వాటిని బుక్ చేసుకోవచ్చు. మొదటి చార్ట్ తయారైన వెంటనే టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోదని సీనియర్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకోవడం వల్ల లేదా ఇతర సర్దుబాట్ల కారణంగా మిగిలిన బెర్తులను రైల్వే శాఖ కరెంట్ బుకింగ్ కింద వర్గీకరించి కేటాయిస్తుంది.

ఐఆర్‌సీటీసీ నిబంధనలు, వెసులుబాట్లు.. 
ఈ కరెంట్ బుకింగ్ సదుపాయం కింద ప్రయాణికులకు కేవలం కన్ఫర్మ్ (Confirm) టికెట్లు మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి ఆర్ఏసీ (RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ (Waiting List) టికెట్లు అందుబాటులో ఉండవని అధికారులు తేల్చి చెప్పారు. ఐఆర్‌సీటీసీ (IRCTC) మార్గదర్శకాల ప్రకారం.. ఈ సదుపాయం సాధారణ ప్రయాణికులతో పాటు ఏజెంట్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో కేవలం ఈ-టికెట్లను (E-Tickets) మాత్రమే అనుమతిస్తారు. వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్లు), దివ్యాంగులకు వర్తించే రాయితీలు ఈ కరెంట్ బుకింగ్ టికెట్లపై కూడా లభిస్తాయి.

ప్రయాణికుల వివరాలు మార్చేందుకు నో..
కరెంట్ బుకింగ్ ద్వారా పొందిన టికెట్లపై ప్రయాణికుడి పేరు, వయస్సు, జెండర్ లేదా ప్రయాణం ప్రారంభించే బోర్డింగ్ పాయింట్ వంటి వివరాల మార్పులకు అవకాశం ఉండదు. అలాగే ప్రీమియం, సువిధ రైళ్ల విషయానికి వస్తే, చివరిగా బుక్ అయిన టికెట్ ధరల ఆధారంగానే ఈ టికెట్ల ధరలు వర్తిస్తాయి.

రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాల్లో మార్పులు..
ఇటీవల రైల్వే శాఖ చార్ట్ తయారీ సమయాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. ఉదయం 05:01 గంటల నుంచి మధ్యాహ్నం 02:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు సంబంధించి, ముందు రోజు రాత్రి 08:00 గంటలకే మొదటి చార్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. మిగిలిన రైళ్లకు కనీసం 10 గంటల ముందు మొదటి చార్ట్ తయారవుతుంది. అలాగే, రైలు బయలుదేరడానికి సుమారు 30 నిమిషాల ముందు తుది చార్ట్‌ను సిద్ధం చేస్తారు. కాబట్టి, మొదటి చార్ట్ తయారీతో బుకింగ్ ముగిసిందని భావించకుండా, అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను నేరుగా తనిఖీ చేసుకుని టికెట్ పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News