SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. రేపు రాత్రి నింగిలోకి GSLV-F18 రాకెట్‌..

GSLV-F18: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీ హరికోటలోని షార్‌ కేంద్రంగా GSLV-F18 రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 29, 2026, 11:53 AM IST | Updated: Oct 29, 2026, 11:56 AM IST
Image Credit: GSLV (File/Source)
Join

ISRO Crucial Mission: రేపు రాత్రి 11 గంటల 51 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 18 రాకెట్‌ను సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ సేవలకు సంబంధించిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. షార్‌లోని వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ వ్యాబ్‌లో రాకెట్‌ మూడు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్తిచేశారు. ఈ ప్రయోగం భారత స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ను మరింత బలోపేతం చేయనుందని ఇస్రో తెలిపింది.

శ్రీహరి కోటలోని షార్‌ కేంద్రంగా రాకెట్‌ ప్రయోగం..
మన రోజువారీ ప్రయాణాల నుంచి కీలకమైన నావిగేషన్ సేవల వరకు శాటిలైట్ పాత్ర ఎంతో కీలకం. అయితే భారత్‌ సొంత నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే మరో కీలక అడుగు అవసరం. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో  NVS-03 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ సేవలను తిరిగి మెరుగుపరచడంలో ఈ ప్రయోగం కీలకంగా మారనుంది. గతంలో ఉపగ్రహాల్లోని అణు గడియారాల పనితీరు నిలిచిపోవడం, వాటి సేవా కాలం ముగియడం, కొన్ని ఉపగ్రహ ప్రయోగాలు విఫలం కావడం వంటి కారణాలతో ఈ వ్యవస్థలో పలు సమస్యలు ఏర్పడ్డాయి. వాటికి పరిష్కారంగా ఈ ప్రయోగం చేపట్టనున్నారు.

నావిగేషన్‌ సేవలను మరింత మెరుగు పరిచేందుకు NVS-03 ఉపగ్రహం..

NVS-03 ఉపగ్రహం రెండో తరం నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో మూడోది. అలాగే భారత ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ IRNSS లో ఇది 12వ ఉపగ్రహం. ఈ ప్రయోగాన్ని తొలుత 2026 అక్టోబర్ 15 నుంచి 20 మధ్య చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతకు ముందు 2025 చివర్లోనే ప్రయోగించాలనే ప్రణాళిక ఉన్నప్పటికీ, పలు కారణాలతో వాయిదా పడింది. ఇటీవల PSLV ప్రయోగాల్లో ఎదురైన అవాంతరాల నేపథ్యంలో ఇస్రో మరింత జాగ్రత్తగా వ్యవహరించి షెడ్యూల్‌ను సవరించింది. ఈ ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరితే నావిగేషన్‌ వ్యవస్థకు అవసరమైన కనీసం నాలుగు పనిచేసే ఉపగ్రహాల సంఖ్యను అందుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా స్థాన నిర్ధారణ సమాచార సేవలను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES