• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Jamui Harassment Case: జముయిలో మైనర్ బాలికపై ఘోరం.. రంగంలోకి జాతీయ మహిళ కమిషన్.. సిట్ ఏర్పాటు.!.

Jamui Harassment Case: జముయిలో మైనర్ బాలికపై ఘోరం.. రంగంలోకి జాతీయ మహిళ కమిషన్.. సిట్ ఏర్పాటు.!.

Bihar Minor girl harassed news: జముయి బాలిక ఘటనపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. అంతే కాకుండా దీనిపై వారంలోగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 21, 2026, 06:40 PM IST|Updated: Sep 21, 2026, 06:50 PM IST
joinshare
Jamui Harassment Case:  జముయిలో మైనర్ బాలికపై ఘోరం.. రంగంలోకి జాతీయ మహిళ కమిషన్.. సిట్ ఏర్పాటు.!.
Image Credit: jamuiharassmentincident

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bihar Jamui Assault case ncw takes as suo motu: బీహర్ లోని జముయిలో మైనర్ బాలికపై వేధింపుల ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. దీనిపై అపోసిషన్ పార్టీలు మండిపడుతున్నాయి. ఈ వేధింపుల ఘటన నెట్టింట విపరీతంగా వైరల్ గా మారింది. జముయిలో టెన్త్ చదువుతున్న ఇద్దరు మైనర్లు ట్యూషన్ తర్వాత నిర్మానుష్యప్రదేశంకు వెళ్లారు. అక్కడ కొంత మంది ఆకతాయిలు వీరిపై మూకుమ్మడిగా దాడి చేశారు. బాలిక ప్రైవేటు పార్ట్ లను తాకుతూ నీచంగా ప్రవర్తించారు. 

ఆమె వదలాలని ప్రాధేయ పడుతున్న కూడా ఆ దుండదులు వదల్లేదు. తమపైశాచీకంను వీడియో తీసుకున్నారు. కొంత మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. జముయి ఘటనను జాతీయ మహిళ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. 

బీహర్ డీజీపీతో జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్  విజయ రహత్కర్  మాట్లాడి.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. వారంలోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను సైతం తొలగించేలా చర్యలు తీసుకొవాలని బీహర్ డీజీపీని, జిల్లా మెజిస్ట్రేట్ కు ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. 

పరారీలో ఉన్న వారి కోసం ఆప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు.  ఈ సంఘటన సెప్టెంబర్ 19న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.


సుమోటోగా స్వీకరించిన NCW ..

ఇద్దరు మైనర్లపై జరిగిన బహిరంగ లైంగిక వేధింపులు, దాడి, బలవంతపు నిర్బంధంను, వేధింపుల ఆరోపణలను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించింది. బాధితులకు “భద్రత, న్యాయ సహాయం, మానసిక కౌన్సెలింగ్ అందించాలని కూడా కమిషన్ కోరింది.


పోక్సో చర్య తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ ..

బీహర్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ పై ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటనలో పాల్పడిన వారిపై పోక్సొ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో అందరిని కలిచి వేసిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ వీడియోను తమ ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “బేటీ బచావో” నినాదంపై  సెటైర్లు వేస్తు ప్రశ్నించింది. 

"మోదీ జీ, 'మహిళల గౌరవం' అన్న మీ వాగ్దానానికి ఏమైందంటూ..? బీజేపీ పాలిత రాష్ట్రమైన బీహార్‌లో ఒక ఆడపిల్ల పరువు నుంచి మాయం అవుతుంటే, మీరంతా ఒక నత్తలా మూగబోయి కూర్చున్నారంటూ... బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి ఒక మచ్చ అని ఆప్ ప్రశ్నించింది. ఈ ఘటనను తృణమూల్ కాంగ్రెస్ కూడా ఖండించింది.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
National News
PM Modi