SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మళ్లీ మార్కెట్‌లోకి Karbonn స్మార్ట్‌ఫోన్లు.. Rebel Pro ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Karbonn Rebel Pro: కార్బన్ కంపెనీ మరోసారి మార్కెట్‌లోకి స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ రెబెల్ ప్రోతో పాటు కార్బన్ రెబెల్ మోడల్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 30, 2026, 05:50 PM IST | Updated: Oct 30, 2026, 05:52 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Karbonn Rebel Pro: గతంలో భారత మార్కెట్‌లో కార్బన్ స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉండేది.. అయితే, ఇతర బ్రాండ్‌లు అద్భుతమైన టెక్నాలజీతో అందుబాటులోకి రావడంతో ఈ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ వ్యాల్యూ తగ్గిపోతూ వచ్చింది. అయితే, ఈ కంపెనీ మరోసారి మార్కెట్‌ను ఏలడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే కార్బన్ రెబెల్‌తో పాటు కార్బన్ రెబెల్ ప్రో స్మార్ట్‌ఫోన్స్ మోడల్స్‌ లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన టీజర్‌లను ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కార్బన్ కంపెనీ ఇంకా కార్బన్ రెబెల్ ప్రోతో పాటు కార్బన్ రెబెల్ మోడల్స్‌కి సంబంధించిన విడుదల తేదీని వెల్లడించలేదు.. కానీ త్వరలోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు విడుదలైన వెంటనే అమెజాన్ ఇ-కామర్స్ సైట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.. ఇప్పటికే వీటి రెండింటికి సంబంధించిన మెక్రో సైట్‌ అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది..

కార్బన్ రెబెల్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఈ వేరియంట్‌లో హై ఎండ్‌ మోడల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 720 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.. దీనివల్ల పగటిపూట కూడా డిస్ల్పే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది పెద్ద స్క్రీన్‌తో అందుబాటులోకి వచ్చిన్నప్పటికీ.. కంపెనీ చాలా ప్రత్యేకమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.. రాబోయే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో కంపెనీ అద్భుతమై జెమిని AI ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఇది రెండు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించడమే కాకుండా.. రెండు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.. రాబోయే ఈ ఫోన్ ఎలాంటి బ్లోట్‌వేర్ లేకుండా.. చాలా క్లీన్‌ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది.. రెబెల్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 6000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఈ ఫోన్‌లో ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్‌ను కూడా అందిస్తోంది..

కార్బన్ రెబెల్ సాధారణ వేరియంట్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.75-అంగుళాల డిస్‌ప్లేను కలిగి కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది HD+ రిజల్యూషన్‌తో పాటు 650 నిట్స్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్‌ను కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ 7000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే ఈ మోడల్స్‌కి సంబంధించిన వివరాలను కార్బన్ టీజర్‌లో పేర్కొంది. అయితే, విడుదల తేదిని త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES