కేదార్‌నాథ్ దర్శనాలు బంద్.. మళ్లీ ఆలయ ద్వారాలు ఎప్పుడు తెరుస్తారంటే?
ప్రతి ఏడాది కేదార్‌నాథ్ ఆలయాన్ని ఆరు నెలలపాటు బంద్ చేస్తారు. ప్రధానంగా ఇక్కడి ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆలయ ద్వారాలు వైదిక శాస్త్రాల ప్రకారం పూజలు నిర్వహించి మూసివేస్తారు. నిన్న రాత్రి చివరి హారతి నిర్వహించారు. ఈరోజు ఉదయం మూసి వేశారు. ఇక ఈ ఆలయ ద్వారాలు మళ్లీ ఎప్పుడు తెరచుకుంటాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Kedarnath Temple Closing Date 2026: పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్.. ఇక్కడికి వెళ్లి శివయ్య దర్శనం చేసుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది. దీంతో చాలా మంది ప్రతి ఏడాది ఇక్కడ వాతావరణం అనుకూలించకపోయినా వస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది కూడా చాలామంది కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. అయితే, ప్రస్తుతం తీవ్రమైన చలి, మంచు కారణంగా ఆలయ ద్వారాలు మూసి వేశారు. ఈ ఆలయం ఆరు నెలల మాత్రమే తెరచి ఉంటుంది. మిగిలిన ఆరు నెలలు ప్రతి కూల వాతావరణం నేపథ్యంలో మూసేస్తారు. ఇక ఇక్కడి కేదార్‌నాథ్ ఉత్సతమూర్తిని ఉఖీమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలిస్తారు. అక్కడే 6 నెలలపాటు నిత్య పూజలు నిర్వహిస్తారు.
ఈ ఏడాదికి నిన్న రాత్రి చివరి హారతి ఇచ్చారు. ఈరోజు ఉదయం వైదిక శాస్త్రాల ప్రకారం పూజలు నిర్వహించి ఆలయ ద్వారాలను మూసి వేశారు. మళ్లీ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే (వైశాఖ మాసం)లో ఆలయ ద్వారాలు తిరిగి తెరుస్తారు.
ఇక్కడ కొండ ప్రాంతం శీతాకాలం, మంచు బాగా కురవడంతో వాతావరణం అనుకూలించదు. ఈ సమయంలోనే ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఈ ఆలయ ద్వారాలు మూసే సమయంలో కూడా ఉత్సవ మూర్తిని సాంప్రదయబద్దంగా ఊరేగింపు నిర్వహించి పల్లకిలో తీసుకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కేదార్‌నాథ్ బాబా నామస్మరణంతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది.
కేదారనాథ్ ఆలయాన్ని ఈ ఏడాది కూడా చాలా మంది భక్తులు దర్శించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు మొత్తం 19,22,138 మంది కేదార్‌నాథ్ ధామ్‌ను దర్శించుకున్నారు. ఈరోజు ఆయలం మూసివేసే సమయంలో కూడా ఐదు వేల మందికి ప్రత్యక్షంగా దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆలయాన్ని కూడా పూలతో అలంకరించారు. చుట్టూ మంచుతో కూడిన కొండలో మధ్యంలో పూలతో అలంకరించిన కేదార్‌నాథ్ ఆలయం, భక్తులతో కిటకిటలాడింది.
స్వయంభూవుగా శివయ్య ఇక్కడ వెలశారు. శివలింగానికి భస్మం, బ్రహ్మకమలలాతో కప్పుతారు. ఆ తర్వాత గర్భగుడి తలుపులు మూస్తారు. ఇక ఈ ఏడాది యాత్రక వచ్చిన భక్తులకు బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ధన్యవాదాలు కూడా తెలియజేశారు. విజయవంతం చేసినందుకు అన్ని విభాగాలు, సంస్థలను కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.