Public Holiday: ఛత్ పూజ సందర్భంగా ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్. ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 16వ తేదీన సోమవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. ప్రసిద్ధ పండగ అయిన ఛత్ పూజ పర్వ దినాన్ని పురస్కరించుకుని ఈ సెలవును ప్రకటించారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంతో ఛత్ పూజ జరుపుకునే వేలాది మంది భక్తులకు పండగ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలు కలుగుతుంది. రాజధాని పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది.
ఛత్ పూజ ఉత్తర భారతదేశంలోని ప్రధాన పండుగలలో ఒకటి. ఢిల్లీలో కూడా చాలా మంది ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో, ఉపవాసం ఉన్న స్త్రీ, పురుషులు సూర్య భగవానుడిని, ఛఠీ మైయాను పూజిస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగలో నహే-ఖాయ్, ఖర్నా, సంధ్యా అర్ఘ్యం, ఉషా అర్ఘ్యం వంటి ప్రత్యేక ఆచారాలు ఉంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో.. నవంబర్ 16వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడం ప్రభుత్వ ఉద్యోగులకు, ఛత్ పండుగ జరుపుకునే వారికి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, ఈ సెలవును ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ప్రకటించారు.
Also Read: