ముంగిస నుంచి తప్పించుకోవడానికి చెట్టెక్కిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
King Cobra Vs Mongoose Video: తాజాగా ఒక చెట్టు కొమ్మపై కింగ్ కోబ్రాతో పాటు ముంగిస దాడి చేసుకుంటున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయిపోతున్నారు. చెట్టుకొమ్మపై ఇలా దాడి చేసుకోవడం చూడడం ఇదే మొదటిసారి అంటూ కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు.
King Cobra Vs Mongoose Video Viral: ప్రకృతిలో రెండు జంతువుల మధ్య జరిగే దాడి ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. ముఖ్యంగా పాము ముంగిస మధ్య శత్రుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముంగిస పాము ఒకదానికొకటి ఎదురెదురు పడితే తప్పకుండా అవి దాడి చేసుకోవడం ఖాయం. అంతేకాకుండా ఈ దాడిలో ముంగిస గెలవడం మనం తరచుగా కొన్ని వీడియోల్లో చూసి ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన భారీ కింగ్ కోబ్రా. ఓ ముంగిస రెండు ఒకే చెట్టు పైకి ఎక్కి దాడులు చేసుకుంటున్నాయి. ఈ అరుదైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
సాధారణంగా ముంగిస దాడి నుంచి తప్పించుకోవడానికి పాము వేగంగా పెదవుల్లోకి వెళ్లి అక్కడే ఉన్న ఒక చెట్టు పైకి పాకుతూ ఎక్కేయడం మనం కొన్ని వీడియోల్లో చూసి ఉంటాం.. అయితే, ఈ వీడియోలోనూ ఒక అత్యంత ప్రమాదకరమైన పొడవైన కింగ్ కోబ్రా ముంగిస భారిన పడకుండా చెట్టు కొమ్మలపైకి ఎక్కి దాక్కోవాలని అనుకుంది.. కానీ ఆ ముంగిస సైతం నాగుపాము వెంబడిస్తూ వేగంగా చెట్టు పైకి ఎక్కేసింది. చెట్టు కొమ్మలపై నిలదొక్కుకుంటూనే ఆ రెండు ఒకదానికొకటి ఎదురుపడి దాడి చేసుకోవడం మీరు గమనించవచ్చు.
కింగ్ కోబ్రా పడక విప్పి బుసలు కొడుతూ ముంగిస పై కాటు వేసేందుకు ప్రయత్నించగా.. ముంగిస మాత్రం ఎంతో చురుకుదనంతో ఆ దాడిని తప్పించుకుంటూ ఎదురుదాడి చెట్టుకొమ్మ పైనే చేయడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. సాధారణంగా భూమిపై అయితే రెండు ఒకదానికొకటి పైన కిందపడి దాడి చేసుకుంటూ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ రెండు చెట్టు కొమ్మలపై దాడి చేసుకోవడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతూ వస్తున్నారు.
ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఎవరు ఏ ప్రాంతం నుంచి రికార్డు చేశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది ఈ వీడియోను షేర్ చేసిన కొన్ని రోజుల్లోనే వేల వ్యూస్ ను సంపాదించుకుంది అంతేకాకుండా చాలామంది ఈ వీడియోకు లైక్ కూడా చేస్తున్నారు చెట్టు కొమ్మలపై బ్యాలెన్స్ చేసుకుంటూ రెండు ఒకదానికొకటి ప్రాణాలను నిలుపుకోవడానికి దాడి చేసుకుంటున్న దృశ్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి కదూ అంటూ సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు.