• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /పరగడుపున నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ప్రకారం ఈ 5 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు!

పరగడుపున నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ప్రకారం ఈ 5 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు!

ఉదయం నిద్రలేవగానే మనం చేసే కొన్ని పనులు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా ఉదయం లేవగానే పళ్లు తోముకొని, ఫేస్ వాష్ చేసుకుని, నీళ్లు తాగుతుంటాము. పరగడుపున ఇలా నీళ్లు తాగడం వల్ల ఆయుర్వేద పరంగా ఎంతో ఆరోగ్య ప్రయోజనం ఉంది. ఉదయం పరగడుపున కాఫీ లేదా టీలు తీసుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 17, 2026, 01:51 PM IST|Updated: Oct 17, 2026, 01:58 PM IST
joinshare
పరగడుపున నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ప్రకారం ఈ 5 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు!
Image Credit: Ayurvedic Morning Rituals

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Rajasthan:  ఒకే అమ్మాయి కోసం ఇద్దరు మైనర్ల ఫైటింగ్.. రాజస్థాన్ లో కోచింగ్ సెంటర్ లో  కలకలం.. వీడియో..

Rajasthan: ఒకే అమ్మాయి కోసం ఇద్దరు మైనర్ల ఫైటింగ్.. రాజస్థాన్ లో కోచింగ్ సెంటర్ లో కలకలం.. వీడియో..

2

బెండకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏం చెబుతున్నారు?

3

పరగడుపున నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ప్రకారం ఈ 5 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు!

4

బ్యూటీ పార్లర్ పెట్టిన కోతులు.. ఒకదానికి మరొకటి మేకప్.. వీడియో!

5

బెంగాల్‌లో నవరాత్రుల్లో అమ్మవారికి చేపల కూర నైవేద్యం.. అసలు కథ ఇదేనా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ayurvedic Morning Rituals: పరగడుపున ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేద పరంగా ఎంతో లాభం ఉంటుంది. చాలామందికి ఉదయం టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగి రోజంతా ఉత్సాహంగా ప్రారంభించడం చాలా మంచిది. దీనివల్ల శరీరం డిహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటమే కాకుండా, వాత దోషాలు కూడా సమతుల్యంగా ఉంటాయి. అలాగే మన శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పూర్వీకుల కాలం నుండి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మెటబాలిజం రేటును పెంచుకోవడానికి పరగడుపున నీళ్లు తాగే అలవాటు ఉంది.

పరగడుపున నీళ్లు తీసుకోవడం వల్ల రోజంతా మన శరీరంపై సానుకూల ప్రభావం ఉంటుంది. సాధారణంగా రాత్రంతా పడుకున్న సమయంలో మన శరీరం డిహైడ్రేషన్‌కు గురవుతుంది. ఉదయం పరగడుపున ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ అవుతుంది. దీనివల్ల అంతర్గత అవయవాల పనితీరు సమతుల్యంగా మారి, రోజంతా మీరు చురుగ్గా పనులు చేసుకోవచ్చు.

పరగడుపున నీళ్లు తీసుకోవడం వల్ల మొదటగా జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది. మెటబాలిజం రేటు పెరుగుతుంది. అంతేకాకుండా, ఇది క్యాలరీలను బర్న్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల రోజంతా మంచి ప్రభావం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఎప్పటికప్పుడు నీళ్లు తీసుకుంటూ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం యాక్టివ్‌గా ఉండాలన్నా, శరీర అవయవాల పనితీరు మెరుగ్గా ఉండాలన్నా, శరీరం డిహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటమే కాకుండా, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లాలి. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగాలి.

సాధారణంగా పరగడుపున నీళ్లు తీసుకోవడం వల్ల డిటాక్సిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది కిడ్నీ, లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదయం పరగడుపున నీళ్లు తాగడం వల్ల వెంటనే యూరినేషన్ జరుగుతుంది, తద్వారా విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటమే కాకుండా, కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కూడా ఉంటాయి.

ఉదయం ఇలా నీళ్లు తీసుకోవడం వల్ల ముఖానికి నేచురల్ హైడ్రేషన్ అందుతుంది, తద్వారా చర్మం మాయిశ్చరైజ్ అవుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, చర్మ కణాలు పునర్జీవం పొందుతాయి. అంతేకాకుండా, నీళ్లు ఎక్కువగా తీసుకునే వారిలో ముఖంపై మచ్చలు, గీతలు తక్కువగా ఉండి, చర్మం ఆరోగ్యకరంగా మెరుస్తూ ఉంటుంది.

Read Also: ఉడకబెట్టిన గుడ్లను ఎంతసేపట్లో తినాలి? ఫ్రిజ్‌లో ఇలా నిల్వ చేస్తున్నారా? తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం!

Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

ఉదయం నీళ్లు తాగడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడి ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. ఇది రక్తపోటును సమతుల్యంగా ఉంచుతుంది. నీరసాన్ని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. అలసట తెలియకుండా ఉండాలంటే ఇలా నీళ్లు తాగుతూ ఉండాలి. ఉదయం కాఫీకి బదులుగా గోరువెచ్చని నీళ్లు లేదా రూమ్ టెంపరేచర్ లో ఉన్న నీళ్లు తీసుకోవడం మంచిది. దీనివల్ల జీర్ణ ఆరోగ్యం, శరీర ఆరోగ్యం మెరుగుపడతాయి. అయితే, పరగడుపున గడ్డకట్టిన చల్లటి నీటిని మాత్రం పొరపాటున కూడా తీసుకోకూడదు, ఎందుకంటే అది అజీర్తి, గ్యాస్‌కు కారణం కావచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:
Health
Home Remedies