SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kolkata Stampede: కోల్ కతా దుర్గామండపంలో తొక్కిసలాట.. 19 కి చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన సీఎం సువేందు..

Kolkata durga pandal stampede: చోర్‌బాగన్ సర్బోజనిన్ దుర్గోత్సవ్ సమితి పూజా పండాల్ లో తొక్కిసలాట ఘటనలో అధికారులు అర్దరాత్రి వరకు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఉత్సవ కమిటి సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీతో పాటు, వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Written By Inamdar Paresh
Published: Oct 18, 2026, 06:36 AM IST | Updated: Oct 18, 2026, 06:48 AM IST
Image Credit: kolkata stampede news
Join

Kolkata pandal stampede update  19 dead and cm suvendu announces exgratia: దసరా పండగ వేళ పశ్చిమ బెంగాల్ లో పెనువిషాదం చోటు చేసుకుంది. ఉత్తర్ కోల్ కతాలోని చోర్ బాగన్ సార్వజనీక్ పూజా పండాల్  స్థానికంగా అత్యంత ప్రసిద్ది చెందింది. ఇక్కడ ప్రతిష్టించిన దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. ఈక్రమంలో నిన్న రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో మండపం క్యూలైన్ లో ఉన్న భక్తులు తలదాచుకునేందుకు మండపంలోకి పరుగులు పెట్టారు. ఇదే సమయంలో ఎంట్రీ, ఎక్సిట్ లు ఒకే మార్గం ఉండటంతో భారీగా తోపులాట జరిగింది. 

ఈ క్రమంలో చాలా మంది భక్తులు కింద పడిపోయారు.  వారిని తొక్కుకుంటూ మిగత వారు వెళ్లడంతో కిందపడ్డ వారు ఊపిరాడక విగత జీవుల్లా మారిపోయారు. ఘటన తర్వాత దుర్గమండపం అంతా చెల్లాచెదురుగా మారిపోయింది. ఎక్కడికక్కడ భక్తులు మూర్ఛపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.  వెంటనే పోలీసులు, అధికారులు రంగంలోకి దిగారు.  

సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఘటనతో మరణించిన వారి సంఖ్య 19కి చేరినట్లు అధికారులు ప్రకటించారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై ప్రధాని మోదీ,  వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి తీవ్ర  దిగ్బ్రాంతి  వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. హుటా హుటీన ఘటన ప్రదేశంకు చేరుకుని దగ్గరుండి ఘటనకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. కోల్ కతా మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రికి వెళ్లి సీఎం సువేందు బాధితులను పరామర్శించారు.
 


ఎక్స్ గ్రేషియా ప్రకటన..

ప్రధాని మోదీ ప్రధాన మంత్రి జాతీయసహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇక సీఎం సువేందు అధికారి మృతుల కుటుంబాలకు 25 లక్షలతో పాటు గ్రూప్ డి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. గాయపడ్డవారికి రూ. 5 లక్షలు పరిహరంను ప్రకటించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


హెల్ప్ లైన్ ఏర్పాటు..


కోల్‌కతాలోని చోర్‌బాగన్ సర్బోజనిన్ దుర్గోత్సవ్ సమితి పూజా పండాల్ వద్ద తొక్కిసలాట తర్వాత దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు.  వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం బాధితుల కోసం 18003455678 అనే హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. కోల్‌కతా పోలీసులు 03322141310 అనే మరో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES