SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పూలు, పండ్లు కాదు.. ఈ ఆలయంలో నీళ్ల బాటిళ్లే ప్రసాదం.. ఎక్కడంటే?

Ladakh Mysterious Temple: లద్దాఖ్‌లో ఈ ఆలయంలో ప్రసాదంగా నీళ్ల బాటీళ్లను సమరిస్తారు. ఈ వింత సాంప్రదాయం కొన్ని ఏళ్ల నుంచి వస్తోంది. అయితే, అక్కడ నీళ్లను మాత్రమే ఎందుకు సమరిపిస్తారు. ఇక్కడి వింత కథ, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 05, 2026, 11:48 AM IST | Updated: Nov 05, 2026, 11:50 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Ladakh Mysterious Temple News: లద్దాఖ్ అనగానే మనందిరికీ గుర్తుకు వచ్చేది మంచుకొండలు, అద్భుతమైన లోయలు, ప్రశాంతమైన వాతావరణం.. అయితే, అక్కడి ఒక కొండ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ఆలయంలో పూలు, పండ్లు కాకుండా కేవలం నీళ్ల బాటిళ్లు మాత్రమే సమర్పిస్తూ వస్తారు. అయితే, ఈ ఆలయం వెనుక ఒక భావోద్వేగంతో కూడిన కథ ఉంది. అంతేకాకుండా భక్తులు భారీ ఎత్తున ఇక్కడ  ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్లు సమర్పించడం వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకు పోతూ వస్తున్నాయి. అయితే, ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ వింత ఆచారం వెనక కొన్ని ఏళ్ల చరిత్ర ఉంది. అంతేకాకుండా 1999లో జరిగిన విషాదకర సంఘటనకు ముడి పడి ఉందని స్థానికులు చెబుతూ ఉంటారు.. ఆ సమయంలో ఇక్కడే ఎత్తైన ఘాట్ రోడ్లపై ప్రయాణిస్తున్న ఒక ట్రక్ డ్రైవర్.. మార్గమధ్యంలో గుక్కెడు నీళ్లు కూడా దొరక్క తీవ్రమైన దాహంతో ప్రాణాలు కోల్పోయాడట..ఎండమావులాగా కనిపించే కొండల్లో ఆయన అనుభవించిన వేదనను చూసి చలించిన స్థానికులు.. ఆయన ఆత్మ శాంతికై అక్కడ ఒక చిన్న మందిరాన్ని ఎప్పుడో నిర్మించారట.. భవిష్యత్తులో ఏ ఒక్కరు ఈ రోడ్డు నుంచి ప్రయాణం చేసేవారు అలాంటి దారుణ పరిస్థితిని ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ప్రయాణికులు అక్కడ నీటిని సమర్పించడం ప్రారంభించారు. ఆ తర్వాతి నుంచి ఇది ఆ మార్గంలో వెళ్లే ప్రతి ట్రక్ డ్రైవరుకు.. పర్యాటకులకు పెద్ద నమ్మకంగా మారుతూ వచ్చిందని స్థానికులు తెలుపుతున్నారు.

ప్రస్తుతం ఆ ఇక్కడి నుంచి ప్రయాణించే వారు మానసిక ప్రశాంతత కోసం నీటి బాటిళ్లను కొనుగోలు చేసి ఆలయం వద్ద సర్పించడం అలవాటుగా మారిపోయింది.. అయితే.. నీటిని సమర్పించిన తర్వాత ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. దీనివల్ల ఆ అద్భుతమైన కొండ ప్రాంతంలో వేల సంఖ్యలో ప్లాస్టిక్ సీసాలు అలాగే ఉండిపోయి.. కాలుష్యానికి కారణమవుతున్నాయి.

ఇటీవల మనీష్ అనే మోటో వ్లాగర్ లద్దాఖ్ పర్యటనలో ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ డ్రైవర్‌కు ఆనాడు నీరు మాత్రమే అవసరమైంది కానీ ప్లాస్టిక్ కాదు.. మనం చూపించే గౌరవం ప్రకృతికి శాపంగా మారకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా అక్కడే ఉండే ఒక లారీ డ్రైవర్ మనీష్ ప్రశంసించారు. ఆ డ్రైవర్ ఆలయం వద్ద ఆగి నీటిని సమర్పించి.. ఆ ఖాళీ బాటిల్‌ను అక్కడే పారేయకుండా తిరిగి తన వాహనంలోకి తీసుకెళ్లాడు. ఒక్క బాటిలే కదా అని మనం అనుకుంటే కొండలు చెత్తకుప్పలుగా మారతాయని.. ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడటం ప్రతి పర్యాటకుడి బాధ్యత అని నెటిజన్లు సైతం స్పందిస్తున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES