పెళ్లి బరాత్‌లో బాలుడి మాస్ డ్యాన్స్.. స్టెప్పులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Little Boy Dance Video: పెళ్లి బారత్‌లో ఒక బాలుడు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను షెక్ చేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లలో ఆ బాలుడి టాలెంట్‌కి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Little Boy Dance Video: వివాహ వేడుకలంటేనే ఆటపాటలు, సందడి, బంధువుల కోలాహలం మాములుగా ఉండదు.. ముఖ్యంగా పెళ్లి బరాత్ సమయంలో బ్యాండ్ సప్పుడులు, డప్పుల చప్పుళ్లకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు.. అయితే.. తాజాగా ఓ పెళ్లి బరాత్‌లో ఓ చిన్నారి వేసిన డ్యాన్స్ ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్దలను సైతం ఆకట్టుకునేలా... ఆ బుడతడు వేసిన స్టెప్పులు నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి.. అయితే, ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో.. ఒక పెళ్లి బరాత్ అత్యంత ఉత్సాహంగా సాగుతోంది... చుట్టూ బంధువులతో పాటు స్నేహితులు బ్యాండ్ స్కౌంట్ డ్యాన్సులు వేయడం మీరు గమనించవచ్చు.. సరిగ్గా అదే సమయంలో గుంపులో ఉన్న ఓ చిన్నారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడం మీరు గమనించవచ్చు.. ఏమాత్రం బెరుకు లేకుండా.. ఆ పాటలకు అనుగుణంగా అద్భుతంగా ఆ చిన్నారి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టడడం మీరు గమనించవచ్చు.. పెద్దవారితో పోటీపడుతూ ఆ బుడతడు వేసిన స్టెప్పులు.. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపోయేలా చేశాయి.. ఆ చిన్నారి ఉత్సాహాన్ని చూసి చుట్టుపక్కల ఉన్నవారు చప్పట్లతో ప్రోత్సహించడంతో మీరు క్లియర్‌గా చూడొచ్చు..
డ్యాన్స్ అనేది కేవలం వినోదం మాత్రమే కాదు.. మనసులోని ఆనందాన్ని వ్యక్తం చేసే ఒక అందమైన కళగా భావించవచ్చు.. ఈ కళను ప్రదర్శించడానికి వయసుతో ఎటువంటి సంబంధం లేదని.. ఈ చిన్నారి తన డ్యాన్స్‌తో మరోసారి నిరూపించాడు. కేవలం ఆ సౌండ్‌పై ఉన్న ఇష్టంతో ఆ బుడతడు వేసిన స్టెప్పులు అందరినీ కట్టిపడేస్తూ వస్తున్నాయి.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని @shivayadav869 అనే ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు లక్షలాది వ్యూస్‌తో పాటు వేల సంఖ్యలో లైకులు వచ్చిన్నట్లు తెలస్తోంది.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. మూర్తి చిన్నదైనా కీర్తి చాలా పెద్దది అంటూ.. కొందరు.. ఈ బుడతడి ఎనర్జీ ముందు పెద్దవాళ్లు కూడా సరిపోరు.. అంటూ మరికొందరు.. చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశాడు.. చూస్తుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంది.. అంటూ సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.