• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /హసీనా సొంత దేశం వెళ్లటంపై బంగ్లాదేశ్ కు భారత్ డిమాండ్..!

హసీనా సొంత దేశం వెళ్లటంపై బంగ్లాదేశ్ కు భారత్ డిమాండ్..!

Bharat Demand to Bangladesh: భారత్‌ లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆమె తిరిగి వెళ్లడానికి భారత్‌ సుముఖంగానే ఉన్నప్పటికీ.. హసీనా భద్రత విషయంలో పొరుగు దేశం హామీ ఇవ్వాలని కోరుతూ భారత్ పలు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 14, 2026, 01:23 PM IST|Updated: Nov 14, 2026, 01:29 PM IST
joinshare
హసీనా సొంత దేశం వెళ్లటంపై బంగ్లాదేశ్ కు భారత్ డిమాండ్..!
Image Credit: Shaik Haseena Returns (ZEE Telugu News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
సూర్య హాట్రిక్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. సింగం రిటర్న్స్..

సూర్య హాట్రిక్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. సింగం రిటర్న్స్..

2

KTR: రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన.. ఎక్స్ వేదికగా కేటీఆర్ సంచలన ట్విట్.. హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు..

3

హసీనా సొంత దేశం వెళ్లటంపై బంగ్లాదేశ్ కు భారత్ డిమాండ్..!

4

పెళ్లి బరాత్‌లో బాలుడి మాస్ డ్యాన్స్.. స్టెప్పులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

5

Andhra Cyclone Alert: ఏపీకి మరో తుఫాను ముప్పు.. 18వ తేదీ నుంచి భారీ వర్షాలు! ఐఎండీ కీలక హెచ్చరిక

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Shaik Haseena Return to Bangladesh: సొంత దేశం బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ స్వదేశానికి వెళ్లబోతున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమెపై దాడులు జరగకుండా భద్రత కల్పించడం, తనకు విధించిన మరణ శిక్షపై హసీనా న్యాయస్థానంలో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించాలని భారత్.. బంగ్లాదేశ్‌ను కోరినట్లు తెలుస్తోంది. నిష్పక్షపాతంగా విచారణను ఎదుర్కొని న్యాయం జరిగేలా చూడడం, 2024 నాటి అణచివేత ఘటనలపై తిరిగి విచారణ జరపడం వంటివి అందులో ఉన్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లేందుకు రెడీ అవుతున్న హసీనా..

అదే టైంలో హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌ కు తీసుకెళ్లడానికి ఆ దేశం తమ సైనిక విమానాన్ని పంపాలని భారత్‌ అడిగినట్లు తెలుస్తోంది.లేదంటే భారత్‌-బంగ్లా భూ సరిహద్దు మార్గంలో పొరుగు దేశ సైన్యం హసీనాను మర్యాద పూర్వకంగా ఆహ్వానించాలని షరతు విధించినట్లు తెలిపాయి. ఈ కథనాలపై బంగ్లాదేశ్‌ ప్రధాని సహాయ మీడియా కార్యదర్శి నజ్ముల్ హక్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హసీనాకు ఆశ్రయం కల్పించడానికి ఏ దేశమూ సుముఖత చూపట్లేదన్నారు. ఆమెకు ఒక్కొక్కటిగా అన్ని మార్గాలు మూసుకుపోయాయని అన్నారు. దీంతో చివరి ప్రయత్నంగా ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని కోరుకుంటున్నారంటూ విమర్శలు చేశారు.

అయితే, హసీనా విషయంలో భారత్‌ షరతులు విధించినట్లు వస్తున్న కథనాలను బంగ్లా ప్రభుత్వం ధృవీకరించలేదు. మరోవైపు, వీటిపై స్పందించడానికి భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ సైతం నిరాకరించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
World News
National News
PM Modi