బతికున్న నాగుపాముకు పూజలు.. అసలేం జరుగుతోంది.. వీడియో!
Live Cobra Worship Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ఒక ప్లాస్టిక్ డబ్బాలో బంధించిన నాగుపాముకు పూజలు చేస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఆ పాము కాటేసే ప్రమాదం ఉందని వన్యప్రాణి సంరక్షకులు చెబుతూ వస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Live Cobra Snake Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లోని కొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని భయాన్ని ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి కోవాకు చెందిన ఒక విచిత్రమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెరలు కొడుతోంది. సాధారణంగా విషపూరితమైన పాములను చూస్తేనే ఆమడ దూరం పరిగెత్తే పరిస్థితుల్లో.. ఏకంగా ఒక బతికున్న నాగుపామున ఇంట్లోని పూజా మందిరంలో ఉంచి ప్రత్యేకమైన పూజలు చేస్తున్న దృశ్యం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అయితే, ఈ ఘటన ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక ఇంట్లోని పూజా గదిలో వివిధ దేవత మూర్తుల చిత్రపటాల మధ్య ఒక ప్లాస్టిక్ డబ్బాను మీరు చూడొచ్చు. ఆ డబ్బా లోపల బ్రతికున్న నాగుపాము ఉండడం మీకు కనిపిస్తుంది. పూజా సామాగ్రితో పాటు ఆ డబ్బా చుట్టూ అద్భుతంగా అలంకరణ చేసి.. ఆ పాముకు అత్యంత నిష్టగా పూజలతో పాటు హారతులు ఇస్తున్న వీడియో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ డబ్బాలో పాము అటు ఇటు కదలడం కూడా మీరు క్లియర్ గా గమనించవచ్చు..
అయితే, ఈ ఘటన ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో చోటుచేసుకుందని దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.. సదరు వ్యక్తులు ఏ నమ్మకంతో లేదా ఏ మొక్కుబడి తీర్చుకోవడానికి ఈ విధంగా చేశారనే విషయం కూడా ఇంకా తెలియలేదు. అయితే, ఈ వీడియో క్లిప్ మాత్రం ఇంటర్నెట్లో పెద్ద సంచలనంగా మారింది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఇది పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఊహించని స్థాయిలో ట్రెండింగ్‌గా మారడం విశేషం..
ఈ దృశ్యాలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కొందరు భారతీయ సాంప్రదాయంలో నాగుపామును నాగదేవతగా ఆరాధిస్తారని.. కానీ ఇలా ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా అత్యంత విషపూరితమైన నాగుపామును ఇంట్లో బంధించి పూజలు చేయడం అత్యంత ప్రమాదకరమని కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఆ డబ్బా ఏ మాత్రం కిందికి జారిపడిన డబ్బా మూత పగిలిపోయి అందులో ఉన్న నాగుపాము బయటికి వచ్చి కాటేస్తే ప్రమాదం ఉందని మరికొంతమంది కామెంట్లలో రాస్తూ వస్తున్నారు. కొందరు మాత్రం మూఢనమ్మకాలతో ఇలాంటి పనులు చేయడం సహజమైపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వన్యప్రాణి జీవులతో చెలగాటమాడటం అస్సలు మంచిది కాదని వన్యప్రాణి సంరక్షకులు చెబుతూ వస్తున్నారు..