Rajasthan: వామ్మో.. దేవుడికి దండం పెట్టి.. రెప్పపాటులో వెండి ఆభరణాలతో పరారైన కేటుగాడు.. వీడియో వైరల్..
Theft in Bhilwara temple: భిల్వార్ జిల్లా పరిధిలోని ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు.ఆ తర్వాత ఆలయంలో పూజలు చేసినట్లు చేసి ఆభరణాల్ని చోరీ చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.
Man theft in sanavaria seth temple in rajasthan: ఇటీవల కొంత మంది కష్టపడి పనిచేయకుండా చోరీల బాటపట్టాడు. ముఖ్యంగా బంగారం ధరలు పెరిగిపోయాయో అప్పటి నుంచి చోరీలు మరీ ఎక్కువయ్యాయి. రోడ్ల మీద, షాపుల్లోను నిత్యం చోరీల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి.కొంత మంది ఇటీవల గుళ్లకు వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని మరీ చోరీలు చేస్తున్నారు. కనీసం దేవుడనే భయం, పాపపుణ్యాల ఆలోచనల కూడా లేకుండా నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో రాజస్తాన్ లోని భిల్వారా జిల్లాలో ఉన్న ఒక ఆలయంలో చోటు చేసుకున్న ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.
రాజస్తాన్ లోని భిల్వారా జిల్లాలో స్థానిక ఆలయంలో భారీ చోరీ జరిగింది. మండల్ పీఎస్ పరిధిలో ఉన్న సాంవరియా సేఠ్ ఆలయంలో జరిగిన చోరీ ఘటన వార్తలలో నిలిచింది. సాంవరియా సేఠ్ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. ఆ తర్వాత దేవుడ్ని ప్రార్థించి గుడిలో దేవుడిపై ఉన్న వెండి ఆభరణాల్ని చోరీ చేసి అక్కడి నుంచి రెప్పపాటులో అక్కడి నుంచి పరారయ్యాడు. అతగాడు ఆలయంలోకి వెళ్లి దేవుడికి ప్రదక్షిణలు చేసి, చేతులు జోడించి ప్రార్థించుకుని.. ఆ తర్వాత ఆభరణాలను దొంగిలించాడు.
దేవుడి మీద ఉన్న స్వామివారి వెండి కిరీటం, వేణువు, చేతులకు ఉన్న 8 కడియాలు, కాళ్లకు ఉన్న 2 కడియాలు కలిపి సుమారు రూ.2 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లాడు.ఈ ఘటనకు చెందిన దొంగ కదిలకలు అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ వీడియో వైరల్గా మారింది.