Madhya Pradesh: ఓర్నీ..కొంప ముంచిన భక్తి.. ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలో ఇరుక్కున్న యువకుడు.. వీడియో వైరల్..
Man stuck under elephant statue in amarkantak: అమర్ కంటక్ ఆలయంలో భక్తుడు ఏనుగు రాతి విగ్రహాం మధ్యలో ఇరుక్కుని పోయాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Man trapped under elephant statue in Amarkantak narmada temple: కార్తీక మాసం నేపథ్యంలో దేశవ్యాప్తంగా శైవ, వైష్ణవ ఆలయాలన్ని భక్తులతో కిట కిట లాడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది దీపాల్ని వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. 365వత్తుల గుత్తి దీపాలు వెలిగించుకుంటున్నారు. పవిత్రమైన మాసం నేపథ్యంలో సత్యనారాయణ వ్రతాలు మొదలైనవి ఆచరిస్తున్నారు. ఈక్రమంలో మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లోని నర్మాదా ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లో ఉన్న నర్మదా ఆలయంను భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు.
ప్రతిరోజు ఆలయంకు భారీగా భక్తులు తరలి వస్తారు. ఇక్కడ ఆలయం ముందు రాతి గణేషుడి విగ్రహం ఉంది. రాతి గణేషుడి విగ్రహం కాలి మధ్యలో నుంచి బైటకు వస్తే చెడు ఫలితాలు, ఒంటి మీద ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ క్రమంలో ఒక భక్తుడు సైతం ఏనుగు కాళ్లమధ్యలో వెళ్లి మరోవైపు నుంచిబైటకు వద్దామని చూశాడు.
కానీ అతను లావుగా ఉండటం వల్ల పొట్ట ఇరుక్కుని పోయి గణపయ్య కాలి మధ్యలో నుంచి బైటకు రాలేక ఇబ్బందులు పడ్డాడు. దీంతో ఆలయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు అక్కడి వారు ఎంతో జాగ్రత్తగా సదరు వ్యక్తిని నెమ్మదిగా బైటకు లాగారు.
ఈ క్రమంలో పెద్ద ప్రమాదం తప్పడంతో సదరు భక్తుడు హమ్మయ్య అని ఊపిరీ పీల్చుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మరీ ఇలాంటి అతి భక్తి అవసరమా..?.. అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తుండగా, మరికొంత మంది మాత్రం పాపం పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డాడు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.