• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /వరంగల్
  • /Telangana Congress: రాజకీయాల నుంచి తప్పుకుండా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. మ్యాటర్ ఏమిటంటే..?..

Telangana Congress: రాజకీయాల నుంచి తప్పుకుండా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. మ్యాటర్ ఏమిటంటే..?..

Mla naini Rajender Reddy: వరంగల్ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. అంతే కాకుండా ఆరోపణలను నిరూపిస్తే రాజీనామాలకు కూడా సిద్దమంటూ సవాల్ విసిరారు.

Written ByInamdar Paresh
Published: Nov 23, 2026, 13:13 IST|Updated: Nov 23, 2026, 13:26 IST
joinshare
Telangana Congress: రాజకీయాల నుంచి తప్పుకుండా..  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. మ్యాటర్ ఏమిటంటే..?..
Image Credit: cmrevanthreddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Viral News: కొడుకు లేడని.. కూతురికి బాధ్యతలు వద్దని.. బతికి ఉండగానే తద్దినం..!

Viral News: కొడుకు లేడని.. కూతురికి బాధ్యతలు వద్దని.. బతికి ఉండగానే తద్దినం..!

2

Telangana Congress: రాజకీయాల నుంచి తప్పుకుండా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. మ్యాటర్ ఏమిటంటే..?..

3

India vs New Zealand 1st Test Highlights: గోడ కట్టేసిన కివీస్ బ్యాటర్లు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు..!

4

మీరు కొన్న బంగారం 916 హాల్‌మార్క్ ఒరిజినలేనా? మొబైల్‌లో ఇలా కన్ఫర్మ్ చేసుకోండి!

5

Secunderabad To Lingampally Traffic: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఇకపై చెక్.. సికింద్రాబాద్-లింగంపల్లి వెళ్లే వారికి బంపర్ ఆప్షన్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mla naini Rajender reddy fires on kcr and ktr: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్న చందంలా రాజకీయాలు హీటెక్కాయి.  ఈ క్రమంలో ఇప్పటికే మణుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదం తీవ్ర చర్యనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల  తెలంగాణకు కొత్త కొత్త ఇంచార్జ్ బీఎం సందీప్ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. వీరి వివాదంపై సీఎం రేవంత్ సైతం కూల్ గా రియాక్ట్ అయ్యారు. ఈసారి వదిలేద్దామని చెప్పడంతో చర్యలు తీసుకుంటారన్న రచ్చకు ఫుల్ స్టాప్ పడింది.  మరోవైపు తాజాగా.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.

 

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ లోని కాళోజీ కళాక్షేత్రం అంశంపై బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల  కాళోజీ కళాక్షేత్రంను తమ బీఆర్ఎస్ ప్రభుత్వం డెవలప్ మెంట్ చేసిందని చెప్పుకొచ్చింది. దీనిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గత బీఆర్ఎస్ హయాంలో కనుక   కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం జరిగిందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుంటానని ప్రకటించాడు. ఈ క్రమంలో కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా హన్మకొండలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పై తీవ్రంగా స్పందించారు.

కాళోజీ కళాక్షేత్రం తాము నిర్మించామని కేటీఆర్ చెప్పుకొవడంవిడ్డూరంగా ఉందన్నారు.  వారు మధ్యలో నిర్మాణంను వదిలేస్తే తమ పార్టీ నిధులు మంజురు చేసి మిగత  పనుల్ని పూర్తిచేసిందన్నారు. అంతే కాకుండా వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంసైతం మధ్యలోనే వదిలేశారన్నారు. తమ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 550 కోట్లతో వరంగల్ ను అభివృద్ధి  చేసిందన్నారు. 

యూడీజీకి 5వేల కోట్ల రూపాయలు మంజూరు చేశామని గుర్తు చేశారు.  ఒక వేళ తన వ్యాఖ్యలు అసత్యమని నిరూపిస్తే   రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెల్చి చెప్పారు.  దమ్ముంటే వరంగల్ అభివృద్ధి పై కేసీఆర్, కేటీఆర్ తనతో చర్యకు సిద్దమా..?.. అంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వ్యాఖ్యలు కాస్త తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Congress
Telangana News
Telugu News