• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /India vs New Zealand 1st Test Highlights: గోడ కట్టేసిన కివీస్ బ్యాటర్లు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు..!

India vs New Zealand 1st Test Highlights: గోడ కట్టేసిన కివీస్ బ్యాటర్లు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు..!

India vs New Zealand 1st Test Highlights: అద్భుతంగా పోరాడిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. మొదటి టెస్టులో భారత్ విజయాన్ని అడ్డుకున్నారు. ఐదో రోజు భారత్ విజయానికి 8 వికెట్లు అవసరం కాగా.. భారత బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశారు. మ్యాచ్ పూర్తి వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Nov 23, 2026, 12:48 IST|Updated: Nov 23, 2026, 12:52 IST
joinshare
India vs New Zealand 1st Test Highlights: గోడ కట్టేసిన కివీస్ బ్యాటర్లు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు..!
Image Credit: India vs New Zealand Highlights (Source: BCCI/X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
India vs New Zealand 1st Test Highlights: గోడ కట్టేసిన కివీస్ బ్యాటర్లు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు..!

India vs New Zealand 1st Test Highlights: గోడ కట్టేసిన కివీస్ బ్యాటర్లు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు..!

2

మీరు కొన్న బంగారం 916 హాల్‌మార్క్ ఒరిజినలేనా? మొబైల్‌లో ఇలా కన్ఫర్మ్ చేసుకోండి!

3

Secunderabad To Lingampally Traffic: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఇకపై చెక్.. సికింద్రాబాద్-లింగంపల్లి వెళ్లే వారికి బంపర్ ఆప్షన్!

4

Madhya Pradesh: ఓర్నీ..కొంప ముంచిన భక్తి.. ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలో ఇరుక్కున్న యువకుడు.. వీడియో వైరల్..

5

రోజురోజుకీ దిగొస్తున్న బంగారం ధరలు దేనికి సంకేతం.. 2 నెలలుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

India vs New Zealand 1st Test Highlights: భారీ స్కోరు.. ప్రత్యర్థి జట్టుపై పూర్తి ఆధిక్యం.. చివరి రోజు గెలుపు కోసం 8 వికెట్లు అవసరం.. బౌలర్ల జోరు చూస్తే.. భారత్ విజయం ఖాయం అనుకున్నారు అందరు.. కానీ న్యూజిలాండ్ బ్యాటర్లు పట్టు వీడలేదు. అడ్డుగోడలా నిలిచి.. తమ జట్టును డ్రాతో గట్టెక్కించారు. దీంతో న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా టెస్టు విజయం కోసం ఎదురుచూస్తున్న 12 ఏళ్ల నిరీక్షణ కొనసాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 119/2 తో ఐదో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్.. మ్యాచ్ ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఓ దశలో 176 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోగా.. విజయంపై ఆశలు చిగురించాయి. అయితే డారిల్ మిచెల్ (49 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (26 నాటౌట్) ఇద్దరు గోడ కట్టేశారు. ఓవర్లు కరిగిస్తూ మ్యాచ్‌ను డ్రాగా దిశగా నడిపించారు.

డెవాన్ కాన్వేను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్‌కు పంపగా.. ప్రసిద్ధ్ కృష్ణ రచిన్ రవీంద్రను ఔట్ చేశాడు. అనంతరం అన్షుల్ కాంబోజ్ టామ్ బ్లండెల్‌ను వెనక్కి పంపాడు. దీంతో న్యూజిలాండ్ 176 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత్ విజయం ఖాయమనే అంచనాలు కనిపించాయి. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు. వికెట్లు కాపాడుకోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. పరుగుల వేగం తగ్గించినా వికెట్ మాత్రం పడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో ఆరో వికెట్‌కు 258 బంతుల్లో 63 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిచెల్ 186 బంతుల్లో 49 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. ఫిలిప్స్ 126 బంతుల్లో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరి పట్టుదలతో న్యూజిలాండ్ ఐదో రోజు ఆటను పూర్తిచేసుకుంది. చివరకు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ అయింది. హెన్రీ నికోలస్ 175 పరుగులతో అజేయంగా నిలవగా.. గ్లెన్ ఫిలిప్స్ 118 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 166 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 720 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ 136, రిషబ్ పంత్ 128 సెంచరీలతో చెలరేగారు. శుభ్‌మన్ గిల్ 98 పరుగులతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీలు బాదారు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగుల ఆధిక్యం లభింనా.. చివరి రోజు న్యూజిలాండ్ వికెట్లను కాపాడుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

ఈ డ్రాతో న్యూజిలాండ్ గడ్డపై భారత టెస్టు విజయ నిరీక్షణ మరోసారి కొనసాగింది. టీమిండియా చివరిసారిగా 2014లో న్యూజిలాండ్‌లో టెస్టు విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఆ దేశంలో టెస్టు గెలుపు కోసం ఎదురుచూస్తున్న భారత్‌కు ఈ మ్యాచ్‌లోనూ నిరాశే ఎదురైంది. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు నికోలస్‌కు దక్కింది. రెండు జట్ల మధ్య రెండో టెస్టు నవంబర్ 27 నుంచి క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ప్రారంభం కానుంది.  

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket