• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /మీరు కొన్న బంగారం 916 హాల్‌మార్క్ ఒరిజినలేనా? మొబైల్‌లో ఇలా కన్ఫర్మ్ చేసుకోండి!

మీరు కొన్న బంగారం 916 హాల్‌మార్క్ ఒరిజినలేనా? మొబైల్‌లో ఇలా కన్ఫర్మ్ చేసుకోండి!

బంగారం ధర తగ్గిందని, పెళ్లిళ్ల సీజన్‌ కూడా మళీ షురూ అయిందని గోల్డ్‌ కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే, మీరు కొన్ని బంగారం 22 క్యారెట్ల ఆర్నమెంటేనా? సింపుల్‌గా మీరు మొబైల్‌లో కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 23, 2026, 12:40 IST|Updated: Nov 23, 2026, 12:54 IST
joinshare
మీరు కొన్న బంగారం 916 హాల్‌మార్క్ ఒరిజినలేనా? మొబైల్‌లో ఇలా కన్ఫర్మ్ చేసుకోండి!
Image Credit: How to Check Gold Purity:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
India vs New Zealand 1st Test Highlights: గోడ కట్టేసిన కివీస్ బ్యాటర్లు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు..!

India vs New Zealand 1st Test Highlights: గోడ కట్టేసిన కివీస్ బ్యాటర్లు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు..!

2

మీరు కొన్న బంగారం 916 హాల్‌మార్క్ ఒరిజినలేనా? మొబైల్‌లో ఇలా కన్ఫర్మ్ చేసుకోండి!

3

Secunderabad To Lingampally Traffic: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఇకపై చెక్.. సికింద్రాబాద్-లింగంపల్లి వెళ్లే వారికి బంపర్ ఆప్షన్!

4

Madhya Pradesh: ఓర్నీ..కొంప ముంచిన భక్తి.. ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలో ఇరుక్కున్న యువకుడు.. వీడియో వైరల్..

5

రోజురోజుకీ దిగొస్తున్న బంగారం ధరలు దేనికి సంకేతం.. 2 నెలలుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

How to Check Gold Purity: లక్షలు పోసి బంగారం కొంటాం..పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్పనిసరి. అప్పు చేసైనా బంగారం కొనే పరిస్థితి. ఇటీవల వరుసగా ఆరు నెలల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. కొన్ని గణాంకాల ప్రకారం 11 నెలల్లో బంగారం ధర రూ.60 వేలు తగ్గింది. అయితే, మీరు కూడా గోల్డ్‌ రేటు తగ్గిందని కొనుగోళ్లు చేస్తున్నారా? మీ బంగారం 916 హాల్‌మార్క్‌దేనా? ఇటీవల నకిలీ బంగారం పేరు కూడా బయటకు వస్తోంది. అంతేకాదు 24 క్యారెట్లు ప్యూర్‌ గోల్డ్‌, 22 క్యారెట్ల ఆర్నమెంట్ లేదా 18, 14 కూడా ఉంటాయి. అయితే, మీరు కొన్న ఆర్నమెంట్‌ ఎంత ప్యూరిటీ కలిగి ఉంది. దాన్ని ఎలా చెక్‌ చేయాలి? బంగారం విషయంలో అయితే, ఎవరినీ నమ్మలేని పరిస్థితి. ఒక్కోసారి ఒక షాపులో ఒక రేటు ఉంటే అదే నగ మరో దుకాణంలో వేరే రేటులో లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు సింపులగా మీరు కొన్ని గోల్డ్‌ ఆర్నమెంట్‌ ప్యూరిటీ చెక్‌ చేసుకోవచ్చు. ఇలా మోసపోకుండా ఉండటానికే కొన్ని డిజిటల్‌ ఫీచర్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. HUID (హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌) ఆరు సంఖ్యలతో ఉంటుంది. ఇది ప్రతి ఒక్క నగపై ప్రింట్‌ చేసి ఉంటుంది. నేరుగా ఈ నెంబర్‌తో మనం ఫోన్‌లోనే ఆర్నమెంట్‌ ప్యూరిటీ చెక్‌ చేసుకోవచ్చు.

HUID నెంబర్‌ అంటే?
హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌. దీంతోనే ఏ నగ అయినా ప్యూరిటీ తెలిసిపోతుంది. ఇది 6 డిజిట్స్‌ ఆల్ఫాన్యూమరిక్‌ కోడ్‌. ప్రతి ఒక్క గోల్డ్‌ జ్యువెలరీపై ముద్రించి ఉంటుంది. ఈ నెంబర్‌తో గోల్డ్‌ కొనుగోలుదారులు నగకు సంబంధించిన ప్యూరిటీ ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. మీరు జ్యువెలరీ కొన్న సమయంలో ఈ HUID నెంబర్‌ సహాయంతో చెక్‌ చేయండి. దుకాణం యజమానిని గుడ్డిగా నమ్మకండి.

 

सोने के आभूषण खरीदते समय उनकी चमक के साथ शुद्धता की प्रमाणिकता सुनिश्चित करना भी आवश्यक है। नकली हॉलमार्किंग से बचने के लिए आभूषण पर अंकित 6 अंकों वाले HUID को BIS Care App के माध्यम से सत्यापित करें और उसकी शुद्धता, आभूषण का प्रकार, हॉलमार्किंग केंद्र एवं अन्य विवरणों की जांच करें। सजग रहें, HUID सत्यापित करें और BIS हॉलमार्क युक्त सोने के आभूषण ही खरीदें। @jagograhakjago @PIB_India @mygovindia #Gold #Hallmark

— Bureau of Indian Standards (BIS) (@IndianStandards) November 22, 2026

 

BIS కేర్‌ యాప్‌..
గోల్డ్‌ ప్యూరిటీ తెలుసుకోవాలంటే కొనుగోలు చేసేవారు ముందుగా BIS కేర్‌ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ యాప్‌ ఓపెన్‌ చేసి HUID ఆప్షన్‌ వెరిఫై చేయండి. ఆరు డిజిట్‌ నెంబర్‌, ట్యాగ్‌ వివరాలు కూడా ఎంటర్‌ చేయాలి. వెంటనే మీ మొబైల్‌ స్క్రీన్‌పై ఆ నగ వివరాలు కనిపిస్తాయి. దీనికి ఎలాంటి నైపుణ్యత అవసరం లేదు.

HUID నెంబర్‌ ఆధారంగా గోల్డ్‌ కొనుగోలు దారులు జ్యువెలరీ ప్యూరిటీ వివరాలు పొందుతారు. అంటే సదరు నగ 18, 22, లేదా దాని క్యారెట్‌ కేటగిరీ చెక్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఆ నగ రకం కూడా తెలుస్తుంది. అంటే అది చైన్‌ లేదా లాకెట్‌, లేదా కమ్మలు వివరాలు కూడా తెలిసిపోతాయి. లేటెస్‌ అప్‌డేట్‌ ప్రకారం ఈ యాప్‌లో సదరు జ్యువెలరీ బరువు కూడా తెలుసుకోవచ్చు.

హాల్‌మార్క్‌ vs HUID తేడా ఏంటి?
బంగారు ఆభరణాలపై ఉన్న HUID నంబర్‌కు, BIS కేర్ యాప్‌ సమాచారానికి మధ్య ఏదైనా తేడా ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి.  ఏ జ్యువెలరీ కొనుగోలు చేసినా రసీదు పత్రం జాగ్రత్తగా పెట్టుకోండి.

Add Zee News as a Preferred Source
TAGS:
Gold Rate
Trending News
Telugu News