Gujarat Gang Rape: ఇదెక్కడి శాడిజం.. ప్రియుడితో భార్య జంప్.. శుధ్ది పేరిట 9 మందితో అత్యాచారం చేయించిన భర్త.!.
Woman gang raped by nine persons: వివాహిత తన భర్తను వదిలేసి తన ప్రియుడితో లేచిపోయింది.ఆ తర్వాత ఆమెను ఎంతో వెతికి కట్టుకున్న భర్త మరల ఇంటికి తీసుకొచ్చాడు. గుజరాత్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Married woman gang raped in Gujarat: ఇటీవల సమాజంలో మరీ దారుణాలు జరుగుతున్నాయి. కొంత మంది కనీసం మానవ విలువలు, కట్టుబాట్లను పాటించకుండా బతుకుతున్నారు. ముఖ్యంగా భార్యభర్తలకు చెందిన ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. పెళ్లిళ్లు చేసుకుని వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు కట్టుకున్న వారిని హత్యలుచేయడం, సుపారీలు ఇచ్చి వదిలించుకొవడం చేస్తున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు వార్తలలో ఉంటున్నాయి.
కొన్ని చోట్ల భర్యలు తమ భర్తలను చంపుతుంటే.. మరికొన్ని చోట్ల భర్తలు తమ భార్యలను హతమారుస్తున్నారు.ఈ క్రమంలో పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు ఉన్న కూడా ఇతరులతో ఎఫైర్ లు పెట్టుకుని భర్తలను, పిల్లలను సైతం చంపుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని సురేంద్ర నగర్ లో దారుణం వెలుగులోకి వచ్చింది.
గుజరాత్ లోని సురేంద్ర నగర్ లో ఒక వివాహిత తన ప్రియుడితో ఇల్లు వదిలి పారిపోయింది. ఆతర్వాత ఆమె భర్త, గ్రామస్థులు మహిళను మరల వెతికి తీసుకొచ్చారు. ఆమెను ఒక చెట్టుకు కట్టేసి దాడి చేశారు.
అంతే కాకుండా ఆమెను నోటికొచ్చినట్లు తిడుతూ, చెట్టుకు కట్టేసి దాడి చేశారు. అంతే కాకుండా ఆమె భర్త సదరు మహిళను తొమ్మిది మందితో అత్యాచారం చేయించాడు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.