Video Viral: బద్రీనాథ్‌లో ‘హరే రామ’ భజన చేసిన మహిళ.. వానరం చేసిన పనికి అంతా షాక్.. వీడియో..
Monkey follows kerala family: వానరం బద్రీనాథ్ లో ఒక కుటుంబంను ఫాలో అయ్యింది. వారు రెస్టారెంట్ కు వెళ్తే అక్కడకు వచ్చి మరీ హరే రామ భజన చేస్తుంటే వానరం కూడా వారితో పాటు అనుకరించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Monkey follows kerala family to Badrinath video viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ అవుతాయి. ముఖ్యంగా వైరల్ వీడియోలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. కొన్ని వీడియోలు చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి. కానీ మరికొన్ని వీడియోలు మాత్రం షాక్ కు గురిచేస్తాయి. మరికొన్ని ఘటనలు మనస్సులలో భక్తి , భావనలను పొంగించేలా ఉంటాయి.
ఈ నేపథ్యంలో బద్రీనాథ్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కేరళకు చెందిన ఒక కుటుంబం బద్రీనాథ్ సందర్శనకు వెళ్లింది. అయితే వీరిని ఒక వానరం అనుకరించింది. రెస్టారెంట్ లో ఆ కుటుంబం కూర్చుని ఉండగా కోతి ఒక మహిళపైకి ఎక్కింది. దీంతో వారు శ్రీ రామ్ జై రామ్, హరే రామ అంటూ భజన చేశారు. సాధారణంగా హనుమంతుడు శ్రీ రాముడు దాసుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
శ్రీరామ నామం ఎక్కడైతే విన్పిస్తుందో అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడని అనాదీగా భక్తులు విశ్వసిస్తారు.అయితే..ఈ కుటుంబం బద్రీనాథ్ లోని రెస్టారెంట్ లో కూర్చుని రామనామం భజన చేస్తుండగా వానరం కూడా వారు చేస్తున్న భజనకు, తాళానికి తగిన విధంగా తన శరీరంను కదుపుతు, వారితో పాటు భక్తితో తన్మయత్వంతో ఊగిపోయింది.
ఈ అరుదైన ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సైతం భక్తితో పొంగిపోతున్నారు.