SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వామ్మె పదుల సంఖ్యలో పిల్ల కింగ్ కోబ్రాలు.. వైరల్ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే!

King Cobra Rescue Video: స్నేక్ క్యాచర్స్ అత్యంత ప్రమాదకరమైన తల్లి కోబ్రా తో పాటు పదుల సంఖ్యలో ఉన్న పిల్ల కోబ్రాలను పట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో వాటిని ఎంతో చాకచక్యంగా పట్టుకుంటున్న దృశ్యాలు మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 17, 2026, 01:13 PM IST | Updated: Oct 17, 2026, 01:15 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

King Cobra Rescue Video: సోషల్ మీడియాలో తరచుగా రకరకాల పాములను రెస్క్యూ చేస్తూ కొంతమంది స్నేక్ క్యాచర్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఓ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులకు వెన్నులో వణుకు పుడుతుంది. జనావాసాలకు అతి సమీపంలో ఉన్న ఒక పుట్టలో భారీ కింగ్ కోబ్రా ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్స్ కు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఒక షాకింగ్ ఘటన ఎదురైంది. అదేంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రజలు నివసించే ఆవాసాలకు అతి దగ్గరగా ఉన్న ఓ బహిరంగ ప్రదేశంలో భారీ పుట్ట ఉండడం.. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే వారు ప్రొఫెషనల్ స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. వారు కూడా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే రిస్క్యూ పరికరాలతో అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న విష సర్పం ఎవరిపై దాడి చేయకముందే చుట్టుపక్కల ఉన్న వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది..

తల్లిపామును సురక్షితంగా బయటికి తీసే ఉద్దేశంతో ఆ స్నేక్ క్యాచర్స్ ఎంతో జాగ్రత్తగా పుట్టను పైనుంచి తొలగించడం మొదలుపెట్టారు. అయితే లోపల మట్టిని తొలగిస్తున్న క్రమంలో ఊహించని దృశ్యం ఎదురయ్యింది. అక్కడున్నది కేవలం ఒక కింగ్ కోబ్రా మాత్రమే కాదని.. దాని దగ్గరే పదుల సంఖ్యలో కింగ్ కోబ్రా పిల్లలు కుప్పలుగా తిప్పలుగా బయటకు వచ్చాయి.. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. అంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ.. ఆ స్నేక్ క్యాచర్స్ ఏ మాత్రం తొందరపడకుండా వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

అయితే ఆ స్నేక్ క్యాచర్స్ వెంటనే.. మొదటగా పిల్ల పాములను పట్టుకునేందుకు ప్రయత్నించారు.. వాటికి ఎలాంటి గాయాలు కాకుండా ఒక్కొక్కటిగా పట్టుకొని ప్రత్యేకమైన బాక్సులో వేశారు. తర్వాత తల్లి కింగ్ కోబ్రా అను సురక్షితంగా పట్టుకొని ప్రత్యేకమైన సంచిలో బంధించారు. ఎలాంటి నష్టం కలిగకుండా వాటిని పట్టుకోవడంతో అక్కడున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం స్నేక్ క్యాచర్స్ వాటిని.. సుదూర ప్రాంతాల్లోకి తీసుకెళ్లి దట్టమైన అడవిలో వదిలిపెట్టినట్లు తెలుస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES