Uttar Pradesh: యూపీలో ఘోరం.. హోటల్ లో నవవధువు అనుమానాస్పద మృతి.. వీడియో వైరల్..
Newly bride died in Jhansi: ఝాన్సీలోని రిషబ్ హోటల్‌లో ముస్కాన్ తన భర్తతో కలసి వెళ్లింది. ఆ తర్వాత ఆమె రెప్పపాటులో విగత జీవిగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Newly married woman collapsed in uttar pradesh jhansi hotel: ఇటీవల సమాజంలో భార్యభర్తలకు చెందిన దారుణాలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల భర్తలు తమ భార్యల్ని చంపితే, మరికొన్ని చోట్ల భార్యలు తమ భర్తల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు, ఆర్థిక పర సమస్యలతో ఒకరిపై మరోకరు సుపారీలు ఇచ్చి మరీ చంపుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముస్కాన్ కు, నిలేష్ కు నాలుగు నెలల క్రిరతం జూన్ 29న పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత కొన్ని రోజులకు నిలేష్ కు అప్పటికే పెళ్లి జరిగిందని విషయం వెలుగులోకి వచ్చింది.
మరోవైపు ముస్కాన్ కు, నిలేష్ కు మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ముస్కాన్, నిలేష్ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇటీవల ముస్కాన్ ను బంధువుల వద్దకు తీసుకెళ్తానని చెప్పి భర్త విదిశలోని హోటల్ కు తీసుకెళ్లాడు. హోటల్ లోని గదిలోకి ప్రవేశిస్తుండగానే రూమ్ లోకి వెళ్లిన కొన్ని సెకన్లకే నవవధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.వెంటనే ఆమె భర్త హోటల్ నుంచి బైటకు పరుగెత్తుకుంటూ వచ్చి ముస్కాన్ ను పైకెత్తి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో ముస్కాన్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ముస్కాన్ తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు. అల్లుడే తమ కూతుర్ని హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోలీసులు ముస్కాన్ డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. ముస్కాన్‌ను ఆమె భర్త హత్య చేశాడని ఆమె తండ్రి రామ్‌జీ లాల్ అహిర్వార్ ఆరోపించారు. అతను మరో మహిళతో ఇండొర్ లో ఉంటాడని విషయం బైటపడిందని, ఆమెతో తరచుగా ముస్కాన్ ను పోలుస్తు నిలేష్ వేధించాడని పోలీసులకు చెప్పారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు, పోస్ట్‌మార్టం రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.