• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /నొయిడా ఎయిర్‌పోర్ట్‌‌కు ప్రధాని నరేంద్ర మోడీ పేరు.. యోగి క్యాబినేట్ కీలక నిర్ణయం..

నొయిడా ఎయిర్‌పోర్ట్‌‌కు ప్రధాని నరేంద్ర మోడీ పేరు.. యోగి క్యాబినేట్ కీలక నిర్ణయం..

Yogi Goverment Named Noida International Airport as PM Modi : నోయిడాలోని జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టాలన్న తీర్మానాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని సీఎం ఆదిత్యనాథ్‌ స్వయంగా మీడియాకు వెల్లడించారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 10, 2026, 12:44 AM IST|Updated: Oct 10, 2026, 10:50 AM IST
joinshare
నొయిడా ఎయిర్‌పోర్ట్‌‌కు ప్రధాని నరేంద్ర మోడీ పేరు.. యోగి క్యాబినేట్ కీలక నిర్ణయం..
Image Credit: Narendra Modi Airport (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో CJP అధినేత అభిజిత్ దీప్కే అరెస్ట్..

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో CJP అధినేత అభిజిత్ దీప్కే అరెస్ట్..

2

Donald Trump: నార్వే దేశానికే ఇది సిగ్గుచేటు.. నోబెల్ శాంతి బహుమతిరాకపోవడంపై ఆక్రోశం వెళ్ల గక్కిన డొనాల్డ్ ట్రంప్..

3

రాహువు సంచారంతో అదృష్టం మారుతుందా.. కన్య, మేషం, తులా రాశుల వారికి ఎలాంటి ఫలితాలు?

4

ప్రధాని మోడీపై CJP అధినేత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..

5

ఢిల్లీ అష్ట దిగ్భంధం.. ధర్నాకు నో పర్మిషన్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

PM Narendra Modi International Airport: భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం  ఆమోదించిందని తెలిపారు. జేవార్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరప్రదేశ్ మంత్రి మండలి కృతజ్ఞతలు తెలిపింది.

మోడీ 25 ఏళ్ల ప్రజా జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్ణయం..

ఈ విమానాశ్రయాన్ని స్విస్ సంస్థ జూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీకి చెందిన అనుబంధ సంస్థ యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌తో కలిసి అభివృద్ధి చేసింది. ఇందులో పెద్ద విమానాలను నిర్వహించగల 3 వేల 900 మీటర్ల రన్‌వేతో పాటు, ఆధునిక నావిగేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 28న ప్రధాని మోడీ దీనిని ప్రారంభించారు. 11 వేల 282 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయంలో.. జూన్ 15న లక్నో నుంచి వచ్చిన ఇండిగో విమానం తొలిసారి ల్యాండ్‌ అయ్యింది.

మల్టీమోడల్ రవాణా కేంద్రంగా నోయిడా ఎయిర్‌పోర్ట్..

ఈ విమానాశ్రయం, వాయు, రోడ్డు, ఇతర రవాణా మార్గాల ద్వారా అనుసంధానంతో ఒక మల్టీమోడల్ రవాణా కేంద్రంగా అభివృద్ధి చేశారు. ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించడమే కాకుండా, ప్రయాణికుల మౌలిక సదుపాయాల భద్రతను ప్రపంచ స్థాయిలో నిర్ధారించడానికి ఈ విమానాశ్రయం ఒక హై-టెక్ కోటగా రూపొందించారు. మొదటి దశలో ఏడాదికి సుమారు 1.2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉండనుంది. నాలుగు దశల నిర్మాణం పూర్తయితే ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది. మన దేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరుతో గుజరాత్‌లో అతిపెద్దదైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తర్వాత ఓ ఎయిర్‌పోర్ట్‌కు ఆయన పేరు పెట్టడం ఇదే తొలిసారి. మన దేశంలో చాలా ఎయిర్‌పోర్ట్‌లకు వివిధ పథకాలకు ఎక్కువగా నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ పేర్లే ఉన్నాయి. వారి తప్పించి వేరే రాజకీయ నేతలు లేనట్టుగా కాంగ్రెస్ పాలకులు అన్ని స్కీమ్స్‌కు స్టేడియాలకు, ఎయిర్ పోర్ట్‌లకు వారి పేర్ల ఉండటాన్ని బీజేపీ నేతలు ప్రస్తావించారు.  

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
PM Modi
Trending News