నథింగ్ ఫోన్ 4aపై రూ.7,700 వరకు డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్!
Nothing Phone 4a: నథింగ్ ఫోన్ (4a) స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026లో భాగంగా రూ.7 వేల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఇప్పుడే కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.
Nothing Phone 4a Price Cut: యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న బ్రాండ్స్‌లో నథింగ్ (Nothing) ఒకటి.. ఈ కంపెనీ విడుదల చేసే స్మార్ట్‌ఫోన్స్‌ను చాలా మంది యువత ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా ఇదే బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్ ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సందర్భంగా నథింగ్ ఫోన్ (4a) స్మార్ట్‌ఫోన్ చాలా చీప్ ధరకే లభిస్తోంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, దీనిపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా నథింగ్ ఫోన్ (4a) ధరపై ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది.. దీనితో పాటు కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్‌తో పాటు డెబిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి అదనంగా ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. అయితే, ఈ ఆఫర్స్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ నథింగ్ ఫోన్ (4a) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.36,999తో అందుబాటులో ఉంది.. అయితే, ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో పేమెంట్ చేసేవారికి రూ.4,700 తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో మీకు ధర రూ. 32,299 లోపే లభిస్తుంది.. ఈ ఫోన్ (4a) బేస్ వేరియంట్ ధర రూ.39,999తో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఫోన్‌పై రూ.7,700 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
నథింగ్ ఫోన్ (4a) ఫీచర్ల వివరాలు..
ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గేమింగ్, OTT కంటెంట్ చూసేవారికి మంచి అనుభూతిని అందించేందుకు ఇందులో ఫ్లూయిడ్ అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందిస్తోంది.. ఇందులో కంపెనీ మల్టీ టాస్కింగ్‌తో పాటు హెవీ గేమింగ్‌ను సైతం సాఫీగా నడిపించేందుకు అద్భుతమైన ప్రాసెసర్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ఫీచర్స్ కూడా లభిస్తోంది..
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో అల్ట్రా-క్లియర్ ప్రధాన కెమెరాతో పాటు సెల్ఫీల కోసం హై-రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాలను కూడా అందిస్తోంది.. తక్కువ వెలుతురులోనూ చాలా అద్భుతమైన ఫోటోలను కూడా అందిస్తోంది. రోజంతా సరిపోయే భారీ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఎలాంటి అవాంఛిత బ్లోట్‌వేర్ (Bloatware) లేని.. క్లీన్ నథింగ్ ఓఎస్ (Nothing OS)ను కూడా అందిస్తోంది..