SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

200MP కెమెరాతో Oppo Find X10 ఫోన్‌ లాంచ్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Oppo Find X10 Series: ఒప్పో కంపెనీ తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ ఒప్పో ఫైండ్ X10ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా ఇది 200MP ప్రధాన కెమెరాతో లాంచ్‌ అయ్యింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 26, 2026, 02:41 PM IST | Updated: Oct 26, 2026, 02:43 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Oppo Find X10 Series: ఒప్పో స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్‌ ఉంది. చాలా మంది ఈ స్మార్ట్‌ఫోన్స్‌ కేవలం కెమెరా కోసం కొనుగోలు చేస్తారు. ఎందుకంటే కంపెనీ ఇందులో అద్భుతమైన కెమెరా సెటప్‌లో అందుబాటులోకి తీసుకు వస్తుంది. అయితే, ఈ ఒప్పో కంపెనీ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను ఒప్పో ఫైండ్ X10 పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఫైండ్ X10తో పాటు ఒప్పో ఫైండ్ X10 ప్రో మాక్స్‌ మోడల్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా స్టాండర్డ్‌ మోడల్ చైనాలో కొత్త కలర్‌ ఆప్షన్‌లో లాంచ్‌ అవ్వడం విశేషం..  ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు నాలుగు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో విడుదలైంది. ఇది ఎంతో అద్భుతమైన 8000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్10 స్మార్ట్‌ఫోన్‌ కొన్ని దేశాల్లో కొత్త రంగులో లాంచ్‌ అయ్యింది.. ఈ ఫోన్ చైనాలో లైట్ టైటానియంతో పాటు క్లియర్ ఆరెంజ్, ఐస్ బ్లూ అనే మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రావడమే కాకుండా.. ఇది ఫారెస్ట్ గ్రీన్ కలర్‌ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఈ కొత్త రంగు వేరియంట్‌ను కార్లోట్టా ఫ్రీయర్‌తో కలిసి ఒప్పో అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది..

ఒప్పో ఫైండ్ ఎక్స్10 స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారికి ఒప్పో కంపెనీ అద్భుతమైన గిప్ట్‌ను కూడా అందించబోతోంది. ఇందులో దానికి సరిపోయే కేస్ కూడా అందిస్తోంది.. ఒక ల్యాన్యార్డ్, ప్రింటెడ్ కార్డ్‌లను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది వుడ్‌ల్యాండ్ ఆర్ట్‌వర్క్ ప్యాకేజింగ్‌లో లభిస్తోంది.. అంతేకాకుండా ఒప్పో దీనిని ప్రత్యేకమైన ట్యాగ్‌లైన్‌తో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్ 30న మార్కెట్‌లో లభించబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ కొత్త వేరియంట్ చైనాలోని అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది..

ఒప్పో ఫైండ్ X10 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 2,768 × 1,272 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 6.59-అంగుళాల LTPO డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది.. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9600M చిప్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది 16GB ర్యామ్‌తో పాటు 1TB వరకు స్టోరేజ్‌తో అందుబాటులోకి రానుంది..

ఈ స్మార్ట్‌ఫోన్‌ 200MP ప్రధాన కెమెరాతో పాటు అదనంగా 200MP పెరిస్కోప్ లెన్స్ కెమెరాతో లాంచ్‌ అయ్యింది. ఇది 50MP అల్ట్రావైడ్ కెమెరాతో విడుదలైంది. ఇందులో ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీతో పాటు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES