• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Arnab Cyclone: తమిళనాడును వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ.!.

Arnab Cyclone: తమిళనాడును వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ.!.

Arnab effect on tamil nadu: అర్నాబ్ తుపాను వల్ల తమిళనాడు రాష్ట్రంలో రోడ్లన్ని జలమయం అయ్యాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు పలు చోట్ల స్కూళ్లకు సెలవుల్నిఇవ్వాలని కోరుతున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 26, 2026, 04:04 PM IST|Updated: Oct 26, 2026, 04:20 PM IST
joinshare
Arnab Cyclone:  తమిళనాడును వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. పలు ప్రాంతాలకు  రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ.!.
Image Credit: tamil nadu rains

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
గుడ్డును అమాంతం మింగేసిన పాము.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

గుడ్డును అమాంతం మింగేసిన పాము.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

2

తెలుగులోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’.. క్రైమ్ కామెడీ డ్రామా గ్లింప్స్ చూశారా..!

3

Arnab Cyclone Update: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్ణబ్ తుఫాను..రైతులు, ప్రజలకు ప్రభుత్వం కీలక సూచనలు!

4

తుమ్మడిహట్టి పై సీఎం రేవంత్ మహా సక్సెస్.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో చర్చలు సఫలం..?

5

తేలుపై పాము దాడి.. చివరికి ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Heavy rain lashes tamil nadu due to Arnab cyclone impact: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలమైన వాయుగుండంలా మారింది. ఈ క్రమంలో అర్నాబ్ తుపాన్ తో  పలు రాష్ట్రాలు కుండపోత వర్షాలతో చిగురుటాకులా వణికిపోతున్నాయి.  తమిళనాడు భారీ వర్షాలతో అతలా కుతలం అవుతుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పలు కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వర్షాలతో సామాన్య జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది.  వాతావరణ కేంద్రం.. కోడైకెనాల్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనితో పాటు 5 జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది. 

ఈక్రమంలో గడిచిన 24 గంటల్లో.. పాంబన్ లో 11.4 సెంమీ, కోయంబత్తురులో 8 సెంమీ, నీలగిరిలోని హెచ్ ఆర్ ఎస్ విజయనగరంలో, పళనిలో ఒక్కొక్కటి 7 సెంమీ, దిండిగల్ లో, వేద సందూరు లో 6 సెంమీ, తిరువళ్లురు, నాగపట్నం, తూత్తుకుడి, ముధురైన కన్నియా కుమారి సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వాన పడింది. 

ఇప్పటికే నీలగిరి జిల్లాలోని ఉద్మండలం, కున్నూరు, కోటగిరి, కుంద తాలూకలోని అన్ని స్కూళ్లు, పెరియకుళం బ్లాక్ లోని పాఠశాలలో సెలవులు ప్రకటించారు.  మరోవైపు తమిళనాడులోని కొన్ని స్కూళ్లు, కాలేజీలకు ఇప్పటికి సెలవులు ఇవ్వక పోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అర్నబ్ తుపాన్ ప్రభావం తగ్గే వరకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని  కోరుతున్నారు. రోడ్లపై ఎక్కడ చూసిన నీళ్లతో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో రాక పోకలు పూర్తిగా స్తంభించి పోయాయి. అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని అధికారులు సూచించారు.  కరెంట్ వయర్లు, లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.  అర్నాబ్ తుపాన్ నేపథ్యంలో.. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను సైతం ఏర్పాట్లు చేశారు. పలు శాఖలకు చెందిన అధికారులకు సెలవుల్నికూడా రద్దు చేశారు. అర్నాబ్ తుపాన్ నేపథ్యంలో ఏ సమయంలో ఎలాంటి విపత్తు ఎదురౌతుందో అని ప్రజలతో పాటు అధికారుల్లో సైతం టెన్షన్ కొనసాగుతుంది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Weather Update
Rain News
Telugu News