• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /నవంబర్ 2026 బ్యాంక్ సెలవుల జాబితా..వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్‌?పూర్తి లిస్ట్ ఇదే!

నవంబర్ 2026 బ్యాంక్ సెలవుల జాబితా..వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్‌?పూర్తి లిస్ట్ ఇదే!

నవంబర్‌ నెల అతి త్వరలో రాబోతుంది. ఈ నెలలో దీపావళి, కార్తీకపౌర్ణమి వంటి పండుగలు రానున్నాయి. అయితే, ఈనెలలో కొన్ని స్థానిక పండుగ రోజుల సెలవులు కూడా వస్తున్నాయి. ఈరోజుల్లో బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ప్రధానంగా ప్రతి ఆదివారం, రెండో, నాలుగో శనివారాలు మొత్తంగా ఈనెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్‌ ఉంటాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 24, 2026, 11:58 AM IST|Updated: Oct 24, 2026, 12:02 PM IST
joinshare
నవంబర్ 2026 బ్యాంక్ సెలవుల జాబితా..వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్‌?పూర్తి లిస్ట్ ఇదే!
Image Credit: November 2026 Bank Holidays

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఆధార్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. అడ్రస్ మార్చడం ఇప్పుడు మరింత ఈజీ! ఇంట్లో నుంచే ఇలా చేసుకోండి!

ఆధార్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. అడ్రస్ మార్చడం ఇప్పుడు మరింత ఈజీ! ఇంట్లో నుంచే ఇలా చేసుకోండి!

2

AP ZPTC MPTC Elections: ఆంధ్రప్రదేశ్ రసవత్తరంగా పరిషత్ పోరు..ప్రధాన పార్టీల నుంచి పోటెత్తిన నామినేషన్లు..ఎవరి బలమెంత?

3

Honor 700 Pro లాంచ్‌కు రెడీ? 200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో కొత్త ఫోన్..

4

Video Viral: పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

5

నవంబర్ 2026 బ్యాంక్ సెలవుల జాబితా..వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్‌?పూర్తి లిస్ట్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

దీపావళి అతి త్వరలో రానుంది. ఈ నవంబర్‌ నెలలోనే ఛత్‌పూజ, గురు నానక్‌ జయంతి, వంగల ఫెస్టివల్‌, కనకదాస్‌ జయంతి వంటి ప్రత్యేక రోజులు కూడా రానున్నాయి. దీంతోపాటు ప్రతి ఆదివారం, రెండో, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులు బంద్‌ ఉంటాయి.  మొత్తంగా నవంబర్‌ నెలలో వచ్చే బ్యాంకు సెలవుల జాబితా ఏంటి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సాధారణంగా ఏ బ్యాంక్‌కు అయినా నేషనల్‌ బ్యాంకింగ్‌ రూల్‌, రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌, స్థానిక పండుగల ఆధారంగా కూడా సెలవులు ఉంటాయి. నేగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ చట్టం ప్రకారం కూడా ఈ సెలవులు ఉండనున్నాయి. అయితే, వివిధ రాష్ట్రాల్లో వచ్చే పండుగలు, ప్రత్యేక రోజుల ఆధారంగా ఈ సెలవులు మారుతూ ఉంటాయి.

నవంబర్‌ నెలలో వచ్చే బ్యాంకు సెలవులు 2026..
నవంబర్‌ నెలలో ఆదివారాు 1,8,15,22,29 తేదీల్లో వస్తున్నాయి. అదేవిధంగా నవంబర్‌ 14, 28 తేదీల్లో రెండో, నాలుగో శనివారాలు వస్తున్నాయి. మొత్తం ఏడు రోజులు దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది.
నవంబర్‌ 9 సోమవారం దీపావళి, గోవర్ధనపూ, విశ్వకర్మ రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు, గ్యాంగ్‌టక్‌, కాన్పూర్‌, లక్నో వంటి ప్రాంతాల్లో బ్యాంకులు బంద్‌ ఉంటాయి.

కొన్ని ప్రాంతాల్లో నవంబర్‌ 10వ తేదీ కూడా విక్రమ్‌ సంవత్‌ న్యూఇయర్‌ సందర్భంగా బ్యాంకులు బంద్‌. నవంబర్‌ 11వ తేదీ భాయ్‌దూజ్‌, నవంబర్‌ 13 శుక్రవారం వంగల ఫెస్టివల్‌ కూడా ఉంది. ఇక నవంబర్‌ 16న ఛత్‌పూజ, నవంబర్‌ 20 ఇగస్‌ బగ్వల్‌, నవంబర్‌ 23 సెంగ్‌ కుట్‌స్నెం, 24వ తేదీ గురునానక్‌ జయంతి, కార్తీక పౌర్ణమి, రాహస్‌ పౌర్ణమి కూడా రానుంది. నవంబర్‌ 27వ తేదీ శుక్రవారం కనకదాస జయంతి ఈరోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని బ్రాంచీల్లో బంద్‌ ఉంటాయి.

Read Also: రేపు అక్టోబర్ 21న ఎస్‌బీఐ, పీఎన్‌బీ సహా ఇతర బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?
 

మీకు ఏవైనా బ్యాంకు పనులు ఉంటే ముందుగానే చెక్‌ చేసుకుని వెళ్లడి.  పెద్ద ఎత్తున నగదు తీసుకోవాలన్నా, డిపాజిట్‌ చేయాలన్నా.. బ్యాంకుకు వెళ్లాల్లిందే. దీంతోపాటు ఇన్‌ పర్సన్‌ కేవైసీ, లాకర్‌ ఇతర డాక్యుమెంటేషన్‌ పనులకు కూడా బ్యాంకులు సందర్శించాల్సిందే. చిన్న మొత్తంలో విత్‌డ్రా, డిపాజిట్‌లకు ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. ఏటీఎం సేవలు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఇక చెక్‌ సెటిల్మెంట్‌ కూడా బ్యాంకులకు వెళ్తేనే అవుతుంది. ఈ పనులు ఉంటే బ్యాంకులు ఆరోజు పనిచేస్తున్నాయా? లేదా? అని చెక్‌ చేసుకుని వెళ్లండి.. లేదంటే ఇబ్బందులు పడతారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Bank Holiday
Reserve Bank of India
Festivals
Telugu News