పాన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఈ 5 రూల్స్ తెలియకపోతే రూ. 10,000 జరిమానా కట్టాల్సిందే!
సాధారణంగా పాన్ కార్డు అనేది ఆధార్ కార్డు మాదిరి తప్పనిసరిగా మారిపోయింది. ఏ ఆర్థిక లావాదేవీలు చేసినా ఈ కార్డు తప్పనిసరి. ఆదాయపు పన్ను రిటర్న్ సబ్మిట్ చేయాలన్నా పాన్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. అయితే, ఈ పాన్ కార్డుకు సంబంధించిన ఈ 5 రూల్స్ తెలియకపోతే మీరే నష్టపోతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
PAN Card Rules Update: ఏ ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. బ్యాంకు ఇతర ఫైనాన్షియల్ లావాదేవీలు చేయాలన్నా పాన్ కార్డు కావాల్సిందే. ఆదాయపు పన్ను రిటర్న్ సబ్మిట్ చేయడానికి కూడా ఇది ఒక కీలక టూల్. పాన్ కార్డు ద్వారా స్థిరాస్తులు కొనుగోలు, వెహికల్, స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు కూడా ఇది కీలకంగా మారింది. ఈ పాన్ కార్డు నెంబర్ ఆధారంగానే ఆదాయపు పన్ను శాఖ వారు ఒక వ్యక్తి లావాదేవీలను మానిటర్ చేస్తారు. అందుకే ఎక్కడైనా పాన్ కార్డు ఇచ్చినప్పుడు తప్పులు లేకుండా చూడాలి. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. పాన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 ఇవే..
ఆస్తుల లావాదేవీలు..
ఏదైనా ఆస్తులు కొనుగోలు లేదా విక్రయాలు జరపాలన్నా పాన్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. ఏదైనా ఇల్లు, దుకాణం, ల్యాండ్ రూ.20 లక్షలకు మించితే పాన్ కార్డు తప్పనిసరిగా సబ్మిట్ చేయాలని గుర్తుంచుకోండి.
వస్తువులు, సేవలు.
వస్తువులు, సేవలు రూ.2 లక్షల కంటే ఎక్కువగా క్రయవిక్రయాలు జరిపినా ఇది తప్పనిసరి.
ఇవి మాత్రమే కాదు.. కొన్ని లిస్ట్ కాని షేర్స్ ఉంటాయి. రూ.1 లక్ష విలువ చేసే లిస్ట్ కాని షేర్స్‌కు కూడా పాన్ కార్డు తప్పనిసరి.
వెహికల్..
ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలంటే రూ.5 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే పాన్ కార్డు తప్పనిసరి. అంటే కారు కొనుగోలు చేస్తే తప్పనిసరిగా పాన్ కార్డు సబ్మిట్ చేయండి. స్టాక్ మార్కెట్ లావాదేవీలకు డీమ్యాట్ ఖాతా ఓపెనింగ్‌కు కూడా పాన్ కార్డు కావాల్సిందే. మ్యూచువల్ ఫండ్స్‌కు, పెట్టుబడులకు తప్పనిసరిగా మారింది.
పాన్ కార్డు సబ్మిట్ చేయకపోతే ఏం జరుగుతుంది?
పాన్ కార్డు సబ్మిట్ చేయకపోతే ఏదైనా బిజినెస్ లేదా సంస్థలు తిరస్కరించే అవకాశం ఉంది. పాన్ కార్డు ద్వారా మీ లావాదేవీలు టీడీఎస్, టీసీఎస్, ఎస్‌ఎఫ్‌టీ, ఏఐఎస్ చానల్ ద్వారా ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందుతుంది. మీరు రిపోర్టు చేసిన ఆదాయం కంటే ఎక్కువ లావాదేవీలు జరిగిపితే మీకు నోటీసు జారీ చేస్తారు.
Read Also: Video: వందే భారత్ స్లీపర్‌లో టికెట్ ప్రింట్ తీసుకెళ్లకపోతే ఫైన్ పడుతుందా? రూల్స్ ఇవే..!!
Read Also: నెలవారీ రీఛార్జ్ గోల లేదు.. 365 రోజులకు కేవలం రూ.2399 మాత్రమే! BSNL బంపర్ ప్లాన్ వివరాలివే!
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.10000 సరైన పాన్ కార్డు సబ్మిట్ చేయకపోతే విధిస్తారు. తప్పుడు సమాచారం వల్ల మీ ఫైనాన్షియల్ రికార్డులపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే మీ అన్ని బ్యాంకు ఖాతాల్లో మీ పాన్ కార్డు వివరాలను సరిగ్గా నమోదు చేయండి.
పాన్ కార్డు ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ లా పనిచేస్తుంది. బ్యాంక్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ లావాదేవీలు, స్థిరాస్తుల కొనుగోళ్లు పాన్‌తో ముడిపడి ఉంటాయి. ఆదాయపు పన్ను శాఖ వారు ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తూ ఉంటారు.అందుకే మీరు ఏ ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు వివరాలు సరిగ్గా ఉన్నాయా? చెక్ చేసుకోండి.