Vande Bharat Sleeper Train Ticket Rules: వందే భారత్ రైళ్లకు మన దేశంలో ఆదరణ పెరిగింది. ఇందులో హై టెక్నాలజీ ఎక్విప్‌మెంట్‌తోపాటు సులభతర రైలు ప్రయాణం అవుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా వచ్చాయి. అయితే, ఈ రైలు నియమాలు తెలుసా? మనం కచ్చితంగా టిక్కెట్ ప్రింట్ కూడా తీసుకువెళ్లాలా? ఆ పూర్తి నియమాలు ఏంటి?
మోడ్రన్ టెక్నాలజీతో వందే భారత్ రైళ్లలో సులభతర ప్రయాణం సాధ్యమవుతోంది. దేశవ్యాప్తంగా కూడా ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు పలు ప్రాంతాల్లో నడుస్తున్నాయి. మీరు కూడా ఈ రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో వారణాసి నుంచి న్యూఢిల్లీ వెళ్లే వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తున్నప్పుడు ఆశ్చర్చపోయారు. అవును సాధారణంగా ఆన్‌లైన్ టిక్కెట్ బుక్ చేసుకుంటే ఫోన్‌లోనే టిక్కెట్ కలెక్టర్‌కు టిక్కెట్స్ చూపిస్తాం. అయితే, వందే భారత్ స్లీపర్ రైలులో టిక్కెట్ ప్రింట్ కూడా టీసీ అడిగారు.
ఇది చూసి చాలామంది ప్రయాణీకులు కూడా ఆశ్చర్యపోయారు. సాధారణంగా అయితే, రిజర్వేషన్ కౌంటర్ వద్ద టిక్కెట్ తీసుకుంటే తప్పనిసరి తీసుకువెళ్లాలి. దీనికి ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో ఓ ప్రయాణీకుడు తన వద్ద ఉన్న ఆరెంజ్, క్రీమ్‌రంగులో ఉన్న టిక్కెట్ టీసీకి ఇచ్చాడు. చెక్ చేసిస ఆ ప్రయాణీకుడికే తిరిగి ఇచ్చేశాడు.
ఈ వీడియోలో టిక్కెట్ ప్రింట్ తీసుకున్న భారతీయ రైల్వే ఇప్పటికే ఎలక్ట్రానిక్ టిక్కెట్ కన్ఫర్మేషన్, ఎస్‌ఎంఎస్, వాట్సాప్ మెసేజెస్, వర్చువల్ రిజర్వేష్ మెసేజ్‌లు కూడా అనుమతిస్తుంది. ప్రయాణికులు ఈ డిజిటల్ టిక్కెట్‌ను టీసీకి చూపించవచ్చు.
ఈ వందే భారత్ స్లీపర్ రైలును వారణాసి నుంచి న్యూఢిల్లీకి ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ అధిత్యనాథ్‌తోపాటు రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ కలిసి అక్టోబర్ 31న ప్రారంభించారు. ఈ వందే భారత్ స్లీపర్ రైలు మొత్తం 16 కోచలు కలిగి ఉంటుంది. ఇందులో 3 ఏసీ, 2ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్‌లు కూడా కలిగి ఉంటాయి. రైలు నెంబర్ 27421 వారణాసి నుంచి న్యూఢిల్లీ వారంలో ఆరు రోజులపాటు నడుస్తుంది. తిరుగు ప్రయాణం చేసే రైలు నెంబర్ 27422. ఇది న్యూఢిల్లీ నుంచి వారణాసికి శనివారం తప్ప మిగతా అన్నీ రోజుల్లో నడుస్తుంది.
ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాగ్ రాజ్, కాన్పూర్ సెంట్రల్, అలీఘర్, ఘజియాబాద్‌గుండా వెళ్తుంది. వందే భారత్ రైలు టిక్కెట్ ధర రూ.1915 నుంచి థర్డ్ ఏసీ టిక్కెట్ ప్రారంభం అవుతుంది. సెకండ్ ఏసీ రూ.2470, ఫస్ట్ ఏసీ రూ.3030 గా ధరలు నిర్ణయించారు.