Baby Arnab: తుపాన్ వేళ జన్మించిన శిశువు.. అర్నాబ్‌గా నామకరణం.. ఎక్కడంటే..?..
Arnab effect: అర్నాబ్ తుపాన్ ప్రభావం తీరం దాటిన కూడా పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో ఆయా ప్రాంతాలన్ని అల్లకల్లోలంగా మారిపోయాయి. ఈ క్రమంలో అర్నబ్ తుపాన్ ప్రస్తుతం తీరందాటిన కూడా ముంపు ఇంకా ఉందని అధికారులు చెబుతున్నారు.
Parents puts her new born child name as baby Arnab in odisha: బంగాళా ఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాన్ ప్రభావంతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రచండమైన గాలుల ప్రభావడంతో చెట్లన్ని కూలిపోయాయి. పలు చోట్ల కరెంట్ స్తంభాలు నెలకొరిగాయి. ఈ క్రమంలో అర్నబ్ ప్రభావంతో ఏపీ, ఒడిశా,తెలంగాణ,తమిళనాడు, జార్ఖండ్లలో కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే.. ఒడిశాలోని గంజాంలో అర్నబ్ తుపాన్ ప్రభావం వేల జన్మించిన ఒక శిశువుకు బేబీ అర్నాబ్ గా నామకరణం చేయడం వార్తలలో నిలిచింది.
ఒడిశా గంజాం జిల్లాలోని పాత్రాపూర్ లో అర్నాబ్ తుపాన్ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న దాదాపు 426 మంది గర్భిణీ స్త్రీలను 'మా గృహ' కేంద్రాలకు తరలించారు. వీరిలో 200 మంది మంది మహిళలు ప్రసవించారు. అయితే..తుపాన్ ప్రభావం పీక్స్ లో ఉండగా జన్మించిన బుడ్డొడికి అతని తల్లిదండ్రులు అర్నాబ్ గా నామకరణం చేశారు.
పాత్రాపూర్‌లోని బురతల్ పంచాయతీకి చెందిన సదరు మహిళక అర్నబ్ ప్రచండ వైపరీత్యం కొనసాగుతుండగా నొప్పులు వచ్చాయి. దీంతో వైద్యులు ఆమెకు సిజెరియన్ చేశారు. ఈక్రమంలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డకు తల్లిదండ్రులు బేబీ అర్నబ్ అని నామకరణం చేశారు. శిశువు జనన ధృవీకరణ పత్రంలో పేరును అర్నబ్‌గా అధికారులు నమోదు చేసి తల్లిదండ్రులకు అందజేశారు.
అదే విధంగా.. పాత్రాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ సంబిత్ బేగ్రే మాట్లాడుతూ.. అర్నబ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి తరలించిన గర్భిణీ స్త్రీల రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ రిపోర్టుల వంటి అన్ని అంశాలను పర్య వేక్షిస్తున్నామని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితికి ప్రాధాన్యత ఇస్తున్నామని, గర్భిణీ స్త్రీల కోసం ఆహార ఏర్పాట్లు చేశామని డాక్టర్ బెగ్రే ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బుడ్డొడికి అర్నాబ్ తుపాన్ పేరు పెట్టడం వార్తల్లో నిలిచింది.