అక్టోబర్ 30న పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు విడుదల! ఎవరికి వస్తాయి? ఎవరు అనర్హులు? వివరాలివే!
PM Kisan 24th installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడుత అక్టోబర్ 30వ తేదీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముందుగానే రైతులు కేవైసీ పూర్తి చేయాలి. వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయి. అయితే, ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్ది పొందాలంటే ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
PM Kisan 24th installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన.. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ప్రధానంగా అర్హులైన రైతులు ప్రతి ఏడాది రూ.6000 ఖాతాల్లో జమ అవుతున్నాయి. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 పొందుతారు. అయితే, ఈ పీఎం కిసాన్ పథకం కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. అప్పటి నుంచి రైతులు ఈ పీఎం కిసాన్ నిధులు పొందుతున్నారు. ఇది వారి సాగు ఖర్చులకు సహాయపడుతున్నాయి. అయితే, పీఎం కిసాన్ నిధులు పొందాలంటే సరైన అర్హత కలిగి ఉండాలి. కేవలం వారు మాత్రమే ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా ఈ పీఎం కిసాన్ నిధులు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా పొందుతారు. అలా 23వ విడుత నిధులు ఈ ఏడాది జూన్ 20న పొందారు.
పీఎం కిసాన్ స్కీమ్‌కు అర్హులు..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్ది పొందాలంటే కేవలం అర్హులైన రైతులు మాత్రమే పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కాదు. ప్రతినెల రూ.10000 కంటే ఎక్కువ పింఛను తీసుకునే వారు కూడా అనర్హులు, అంతేకాదు కుటుంబంలో కేవలం ఒకరు మాత్రమే అర్హులు. ఈ స్కీమ్ గైడ్‌లైన్స్ ప్రకారం ఈకేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇక్కడే మీరు బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Read Also: అక్టోబర్ 30న రైతు ఖాతాల్లో రూ.2000 జమ.. డబ్బులు పడాలంటే ఈ పనులు వెంటనే చేయండి!
Read Also: ఈ చిన్న QR కోడ్‌తో పీఎం కిసాన్ యాప్ డౌన్‌లోడ్ చేయండి.. మీ స్టేటస్ వెంటనే చెక్ చేసుకోండి!
పీఎం కిసాన్ స్టేటస్ బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకునే విధానం..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisam.gov.in లో మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ know your status ద్వారా మీ ఇన్‌స్టాల్‌మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు. రైతులు ముందుగా రికార్డులు కూడా వెరిఫై చేసుకోవాలి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన నిబంధనలు కూడా పూర్తిగా తెలుసుకుని దరఖాస్తు చేయాలి. అప్పుడే పీఎం కిసాన్ నిధులు మీ ఖాతాల్లో జమ అవుతాయి.