SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఈ చిన్న QR కోడ్‌తో పీఎం కిసాన్‌ యాప్ డౌన్‌లోడ్ చేయండి.. మీ స్టేటస్ వెంటనే చెక్ చేసుకోండి!

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన.. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతు స్కీమ్‌. దీని ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. అర్హత ఉన్న రైతులు ప్రతి ఏడాది రూ.6000 డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ అవుతుంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 జమ అవుతాయి. ఖాతాలో డబ్బు పడిందా? లేదా? అనేది సింపుల్‌గా మీరు ఒక క్యూఆర్‌ కోడ్‌ ద్వారా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని తెలుసుకోవచ్చు.

Written By Renuka Godugu
Published: Oct 22, 2026, 09:08 AM IST | Updated: Oct 22, 2026, 09:13 AM IST
Image Credit: PM Kisan Status Check 2026:
Join

PM Kisan Status Check 2026: కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పీఎం కిసాన్‌ యోజన 24వ విడుత కోసం ప్రస్తుతం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవి రూ.2000 చొప్పును రైతుల ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా జమ అవుతాయి. అయితే, మీరు కూడా ఈ స్కీమ్‌కు అర్హులు అవుతారా? అనేది సింపుల్‌గా బెనిఫిషియరీ స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు. దీనికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంట్లోనే కేవలం స్మార్ట్‌ఫోన్‌లో పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా పని పూర్తి చేయవచ్చు.

పీఎం కిసాన్‌ యాప్‌ అంటే?
ప్రధాన మంత్రి కిసాన్‌ యాప్‌ అంటే కేంద్ర ప్రభుత్వ అధికారిక మొబైల్‌ అప్లికేషన్‌. పీఎం కిసాన్‌ స్కీమ్‌కు సంబంధించిన వివరాలు రైతులు వివరాలను యాక్సెస్‌ చేయవచ్చు. ఇది సింపుల్‌గా మొబైల్‌ ఫోన్‌లోనే జరుగుతుంది. అంతేకాదు, తదుపరి విడుతకు అర్హత కూడా వాయిదా స్టేటస్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్‌ ద్వారా మీరు వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా ఈకేవైసీ పూర్తి చేయాలి.

పీఎం కిసాన్‌ స్టేటస్‌ చెక్‌ చేసే విధానం..
పీఎం కిసాన్‌ లబ్ధిదారుల స్టేటస్‌ తెలుసుకోవచ్చు.
మొదటగా అధికారిక పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌ pmkisn.gov.in ఓపెన్‌ చేయండి.
ఆ తర్వాత know your status ఆప్షన్‌ ఎంచుకోండి.
మీ వ్యక్తిగత, రిజిస్ట్రేషన్‌ వివరాలు నమోదు చేయాలి.
అక్కడ స్క్రీన్‌పై ఉన్న నిబంధనలు ఫాలో అవ్వాలి.
ఇప్పుడు మీరు వాయిదా, పేమెంట్స్‌, అప్లికేషన్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు.

 

 

పీఎం కిసాన్‌ యాప్‌ ఫీచర్స్‌ ఇవే..
ఈ యాప్‌ మీకు ఈకేవైసీ ఫేస్‌ అథెండికేషన్‌ చేస్తుంది., ఇక్కడ మీరు వాయిదా తేదీలను కూడా పొందవచ్చు. లబ్దిదారుల జాబితాలో మీ పేరు చెక్‌ చేసుకోవచ్చు. అయితే, ఇందులో మీరు ఏదైనా ఫిర్యాదు చేయాలంటే రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, వివరాలు తప్పనిసరి.

Read Also:  దీపావళికి ముందే రైతుల ఖాతాల్లోకి రూ.2,000? 24వ విడత సొమ్ము వచ్చేది వారికే!

Read Also: పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్! IPPB ప్రాసెస్!

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. వారు పొందుతును రూ.6000 సాగు ఖర్చులు ఉపయోగపడతాయి. 9 కోట్ల మందికి పైగా రైతులు ప్రస్తుతం 24వ విడుత కోసం ఎదురు చూస్తున్నారు. అవి దీపావళికి ముందే పడతాయని ఎదురు చూస్తున్నారు. అయితే, పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన అప్‌డేట్‌ ఇంకా రాలేదు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES