నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు..
PM Kisan Samman Nidhi: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ నిధులు ఈ రోజు రైతులు అకౌంట్లలో డిపాజిట్ కానున్నాయి. దీపావళి కానుకగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 24వ విడత డబ్బులు నేడు గుజరాత్ వేదికగా విడుదల చేయనున్నారు.
PM Kisan Money: దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడుత డబ్బులను ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేస్తారు. గుజరాత్‌లోని బనస్‌కాంఠా జిల్లా, భిల్డి పట్టణంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేస్తారు.
24వ విడత ద్వారా 9.44 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి..
అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ. 2వేల చొప్పును నేరుగా జమ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.34 కోట్ల మందికి పైగా రైతు కుటుంబాలకు 18,680 కోట్ల రూపాయలకు పైగా నేరుగా ఖాతాల్లోకి జమ కానున్నాయి. రబీ పంటల పెట్టుబడికి సరిగ్గా పండుగ ముందు ఈ ఆర్థిక సాయం అందుతుండటంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
E-KYC చేసుకున్న రైతులకే డబ్బులు అందుతాయన్న కేంద్రం..
అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథక ప్రయోజనం దక్కాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఇప్పటివరకు తమ ఖాతాకు ఇ-కేవీసీ ప్రక్రియను పూర్తి చేయని రైతుల ఖాతాల్లో నిధులు జమ కావు. కాబట్టి రైతులు వెంటనే తమ సమీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి లేదా పీఎం కిసాన్ పోర్టల్/యాప్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలిని సూచించింది. దీనితో పాటు భూమి వివరాల ధ్రువీకరణ, ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధానం పూర్తయిన వారికి మాత్రమే ఈ విడత సొమ్ము త్వరతిగతిన జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.