SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రోడ్డు ప్రమాద బాధితులకు రూపాయి ఖర్చు లేకుండా తక్షణ చికిత్స.. ఆసుపత్రులకు NMC కీలక ఆదేశాలు!

PM RAHAT Scheme: దేశంలో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న క్షతగాత్రులకు ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

Written By Bhoomi
Published: Nov 17, 2026, 10:41 IST | Updated: Nov 17, 2026, 10:43 IST
Image Credit: PM RAHAT Scheme:
Join

PM RAHAT Scheme: దేశంలో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న క్షతగాత్రులకు ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులకు సత్వరమే నగదు రహిత  అత్యవసర చికిత్సను అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘పీఎం-రాహత్’ (PM-RAHAT) పథకంలో విధిగా భాగస్వాములు కావాలని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) స్పష్టం చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులకు ఎన్‌ఎంసీ తాజాగా అధికారిక పబ్లిక్ నోటీసు జారీ చేసింది.

రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్‌లో (Golden Hour) బాధితులకు ప్రాథమిక వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలను నివారించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల నమోదు (Registration) ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ వేగవంతం చేయాలని మెడికల్ కాలేజీల డైరెక్టర్లు, డీన్లు, ప్రిన్సిపాల్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్లను ఎన్‌ఎంసీ  కోరింది. ఈ పథకం అమల్లోకి వస్తే ప్రమాద బాధితులకు తక్షణమే ఉచితంగా అత్యవసర వైద్యం అందే అవకాశం ఉంది.

కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖల సూచనల మేరకు ఎన్ఎంసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 2026 ఫిబ్రవరి 13వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైన పీఎం రాహత్ స్కీమ్ కింద అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్టంగా రూ. 1.5లక్షల వరకు ఉచిత చికిత్స లభించనుంది. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజుల పాటు ఈ క్యాష్ లెస్ సదుపాయం కూడా వర్తిస్తుంది. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్ లో వైద్యం అందించడమే ఈ స్కీము ముఖ్య ఉద్దేశ్యం. ప్రాణాపాయం లేని కేసుల్లో 24గంటల వరకు తీవ్ర గాయాలైన బాధితులకు 48గంటల వరకు సెబిలైజేషన్ చికిత్సకు అనుమతిస్తారు. ః

బాధితులు లేదా సంఘటనా స్థలంలో సహాయం చేస్తున్నవారు.. నిర్దేశిత ఆసుపత్రులు, అంబులెన్స్‌ల గురించి సమాచారం పొందడానికి '112' అత్యవసర నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఈ పథకంలో పాల్గొనే ఆసుపత్రులలో 24 గంటల అత్యవసర సేవలు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, ఎక్స్-రే, సీటీ స్కాన్, ఇంకా ట్రామా, ఆర్థోపెడిక్ , జనరల్ సర్జరీ వైద్యులు వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ (ఏబీ పీఎం-జేఏవై) కింద ఉన్న ఆసుపత్రులు నేరుగా అర్హత పొందుతాయి. ఇతర ఆసుపత్రులు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌ఎంసీ సూచించింది.

Also Read: 

చదువే తలరాతను మార్చే ఆయుధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!

మళ్లీ పతనమైన బంగారం ధర.. తులం 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES