Narendram Modi Mann ki Baat: ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించాకా.. నరేంద్ర ప్రజలకు చేరువయ్యేందకు మీడియాను కాకుండా సోషల్ మీడియాను ఎంచుకున్నారు. ఏది ఉన్నా.. తన సామాజిక మాధ్యమాల ద్వారా నేరుగా ప్రజలకు తన మనసులోని మాటలతో పాటు దేశానికి సంబంధించిన కీలక విషయాలను ప్రజలతో నేరుగా పంచుకుంటున్నారు. ఇందులో ఎలాంటి ఫిల్టర్స్ లేవు. ఎలక్షన్స్ సందర్భంగా కొన్ని రోజులు మినహా ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో నేరుగా సంభాషిస్తున్నారు. అంతేకాదు దేశంలోని వివిధ రంగాల్లో గుర్తింపుకు నోచుకోని వారిని ఈ సందర్భంగా వెలికి తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సారి అమెరికాలోని న్యూయార్క్ నగరంపై జరిగిన 9/11 దాడి 25 యేళ్లు పూర్తైన సందర్భంగా ఉగ్రవాదంపై మెతకవైఖరి సరైంది కాదని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై కఠిన వైఖరి..
ఆదివారం జరిగిన 138వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న 'కఠిన వైఖరి'ని (zero-tolerance policy)ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన 2008 నాటి ఢిల్లీ పేలుళ్లు మరియు 26/11 ముంబై ఉగ్రవాద దాడులను గుర్తుచేసుకున్నారు.
'మన్ కీ బాత్' 138వ ఎపిసోడ్‌లో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ..
"ఉగ్రవాద దాడులు చాలా కాలం పాటు భారత్‌ను ఎంతో కాలం వేధించాయి. ఒకప్పుడు (కాంగ్రెస్ జమనా) దేశంలో వరుస పేలుళ్లు (serial blasts) సర్వసాధారణంగా జరిగేవి. సరిగ్గా ఇదే సెప్టెంబర్ నెలలో, అంటే 2008 సెప్టెంబర్ 13న, ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో అనేకమంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది వారాలకే ముంబైలో భారీ 26/11 దాడి జరిగింది. అంతకుముందు కూడా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వచ్చేది. కానీ వాటిపై అప్పటి ప్రభుత్వాలు తగినంత దృష్టి సారించలేదు. కానీ నేటి భారత్ ఉగ్రవాదం పట్ల 'కఠిన వైఖరి'ని (Zero-tolerance Policy) అనుసరిస్తోంది. మనపై దాడి చేసిన వారిని వెంటాడి వేటాడుతున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదం విషయంలో మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
అదే కార్యక్రమంలో ప్రసంగిస్తూ, న్యూయార్క్‌లో జరిగిన 9/11 ఉగ్రవాద దాడికి 25 ఏళ్లు పూర్తయిన విషయాన్ని కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.
9/11 దాడులకు 25 యేళ్లు పూర్తి..
ఈ ఏడాదితో 9/11 ఉగ్రవాద దాడి జరిగి 25 ఏళ్లు పూర్తవుతున్నాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన అమాయకులలో, అమెరికన్ల తర్వాత అత్యధిక సంఖ్యలో భారతీయులే ఉన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, న్యూయార్క్‌లో ఆ అమాయక పౌరులకు నివాళులర్పించడానికి నేను అమెరికా వెళ్లిన సందర్భం ఇప్పటికీ నాకు గుర్తుందని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. నేడు మరోసారి, కోట్ల మంది భారత పౌరుల తరపున, ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తన ప్రసంగంలో ప్రధానంగా పేర్కొన్నారు.