Pune Techie Murder: ప్రియురాలిని చంపి రాత్రంతా శవం పక్కన కూర్చుని ఆ పని .!. పూణెలో వెలుగులోకి దారుణం..
Pune Techie murder case: పూణెకు చెందిన టెకీలు కోమల్ దహలే, శుభం ధ్యానేశ్వర్ కల్బండేలు ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా వీరి ప్రేమకు అంగీకరించారు. ఇటీవల అనుమానంతో తరచుగా గొడవలు పడ్డారు.ఈ నేపథ్యంలో శుభం కోమల్ ఉంటున్న గదిలోకి వెళ్లి ఆమెను దారుణంగా కొట్టి హతమార్చాడు.
Pune Techie Beats his Girlfriend to death: ఇటీవల చాలా మంది యువతీ, యువకులు ప్రేమ వివాహాలకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి డేటింగ్ చేస్తు లివింగ్ రిలేషన్ లో కూడా ఉంటున్నారు. ఒకరి అభిప్రాయాలు మరోకరితో షేర్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత బేధాభి ప్రాయాల వస్తే బ్రేకప్ లు చెప్పుకుంటున్నారు. లవ్ లో ఉన్నప్పుడు కొంత మంది అవతలివారితో మాట్లాడిన కూడా అనుమానంతో తమ వారితో గొడవలు పడతారు. చాలా పొసెస్సివ్ గా ఉంటారు. కొంత మంది ప్రేమలో ఉన్నప్పుడు అవతలి వారిని కళ్లలో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఏమైన తేడా వచ్చి బ్రేకప్ చెబితే గొడవలు పడి హత్యలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పూణేలో దారుణం చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన కోమల్ దహాలే (27), బుల్ధానాకు చెందిన శుభం ధ్యానేశ్వర్ కల్బండే ఇద్దరు పూణెలో టెకీలుగా పనిచేస్తున్నారు. వీరు మూడేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్నారు. కోమల్ విప్రోలో పనిచేస్తుండగా, శుభం మాత్రం ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు. తమ ప్రేమను రెండు కుటుంబాల వారికి చెప్పారు. వారు కూడా అంగీకరించారు.
అయితే..ఏమైందో కానీ ఇధ్దరు ఒకరిపైస మరోకరు పరస్పరం అనుమానం పెంచుకున్నారు. తరచుగా వీరి మధ్య గొడవలు జరిగేవి.ఇటీవల కోమల్ పెయింగ్ గెస్ట్ రూమ్ కు శుభమ్ వెళ్లాడు. రాత్రంత వీరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంలో శుభమ్..కోమల్ పై దాడి చేశారు. ఆమె తలను గోడకు బలంగా కొట్టాడు. ఆమె ప్రైవేటు పార్ట్ లపై దారుణంగా దాడి చేశాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆమె విగత జీవిగా మారిపోయింది.
ఆ తర్వాత అతను కూడా షాక్ లో ఉండిపోయి ఆమె శవం పక్కనే రాత్రంతా ఆమెను చూస్తు ఉండిపోయాడు. తెల్లవారు జామున పోలీసులకు ఫోన్ చేసి తన ప్రియురాలిని చంపినట్లు చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతి గదిలోకి వచ్చి ఆమెను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని విగత జీవిలా మారిన తమ కూతుర్నిచూసి కన్నీరు మున్నిరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరి మధ్య అనుమానంతోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.