SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Rahul Gandhi Accident: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు..!

Rahul Gandhi Convoy Accident Updates: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భద్రతా కాన్వాయ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం జరిగింది. లక్నో విమానాశ్రయం నుంచి సుల్తాన్‌పూర్‌లోని కోర్టుకు వెళ్తుండగా.. వేగంగా వెళ్తున్న వాహనాలు హఠాత్తుగా బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 26, 2026, 11:10 AM IST | Updated: Oct 26, 2026, 12:50 PM IST
Join

Rahul Gandhi Convoy Accident Updates: కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ గాంధీ సెక్యురిటీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా.. రాహుల్ గాంధీ మాత్రం ఎటువంటి అపాయం లేకుండా సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. లక్నో విమానాశ్రయం నుంచి సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టుకు రాహుల్ గాంధీ తన కాన్వాయ్‌తో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదం ఎలా జరిగింది..?

పరువు నష్టం కేసు విచారణ నిమిత్తం లక్నో నుంచి సుల్తాన్‌పూర్‌కు రాహుల్ గాంధీ వెళుతున్నారు. కాన్వాయ్ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న సమయంలో.. ముందు వెళ్తున్న వాహనం హఠాత్తుగా బ్రేక్ వేసింది. దీంతో వెనుక వస్తున్న కాన్వాయ్ వాహనాలు కంట్రోల్ తప్పి కోల్పోయి ఒకదాని వెనుక ఒకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు కాన్వాయ్‌లోని కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వాహనాల్లో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక హలియాపూర్ పోలీసులు, భద్రతా దళాల సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించారు. రోడ్డుపై ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి.. స్తంభించిన ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES