Jailer 2 Will Cross 1000 Crore: సూపర్ స్టార్ రజినీకాంత్ 75 వయసులో కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. మన దేశంలో ఈ వయసులో ఈ రేంజ్‌లో చొక్కా నలగకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరో రజినీకాంత్. ఇక సినీ ఇండస్ట్రీలో రిటైర్మెంట్ గా పరగణించే ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఏ నటుడు ఈ రేంజ్‌లో హిట్ కొట్టలేదు. మొత్తంగా ‘జైలర్ 2’ మూవీతో కోలీవుడ్ ఇండస్ట్రీ కొత్త రికార్డులు వెతుక్కుంటోంది. ఈ సినిమా 12 రోజుల్లో దాదాపు రూ. 715 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
జైలర్ 2 ఇండస్ట్రీ హిట్..
గతంలో రజినీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘2.O’ సినిమా నెగిటివ్ టాక్‌తో కూడా దాదాపు రూ. 710 కోట్లను వసూళ్లను సాధించి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దాదాపు 8 యేళ్ల వరకు ఈ సినిమా రికార్డును ఏ చిత్రం టచ్ చేయలేకపోయింది. తాజాగా రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్ 2’ మూవీ ఇపుడా రికార్డును బద్దలు కొట్టింది. ఈ సినిమా టోటల్ రన్‌లో రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశిస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు తమిళంలో ఏ చిత్రం రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించలేదు.
రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో జైలర్ 2 ?
ఇప్పటి వరకు మన దేశంలో తొలిసారి బాహుబలి 2 రూ. వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత దంగల్, జవాన్, పఠాన్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కల్కి 2898 ఏడీ, పుష్ప 2, దురంధర్, దురంధర్ 2 చిత్రాలు మాత్రమే వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాయి. ఇక ఓ సినిమా రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాలంటే హిందీ మార్కెట్ అనేది అత్యంత కీలకం. హిందీ ప్రేక్షకులు చూస్తేనే ఏ సినిమా అయినా.. వెయ్యి కోట్లు క్రాస్ చేసేది. ‘జైలర్ 2’ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో ఇరగదీస్తోన్న కీలకమైన హిందీ భాషల్లో పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఈ సినిమా ఫైనల్ రన్‌లో రూ. 850 కోట్ల గ్రాస్ వసూళ్లకే పరిమితం కానున్నట్టు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్న మాట.
హిందీ కలెక్షన్స్..
ఇకపై తమిళంలో తెరకెక్కించే ఏ చిత్రమైనా ప్యాన్ ఇండియా ప్రేక్షకులు అంటే హిందీ ప్రేక్షకుల ఆదరిస్తేనే ఆ సినిమా రూ. వెయ్యి కోట్లు క్రాస్ చేస్తుంది. కేవలం రీజనల్ లాంగ్వేజ్‌లను నమ్ముకుంటే రూ. 1000 కోట్లు దాటడం ఇంపాజిబుల్. ఏది ఏదైనా ‘జైలర్ 2’ ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం మాములు విషయం కాదు. తెలుగు, కన్నడ,తమిళం, మలయాళం ఇండస్ట్రీలో ఉన్న ఏ సీనియర్ స్టార్ హీరో కూడా రజినీకాంత్ దరిదాపుల్లో లేరనే విషయం అర్థమవుతుంది.