YS Jagan: షర్ట్ మడతబెట్టా.. ఎవరు వస్తారో రండి.. చూసుకుందాం!.. దెబ్బతిన్నా.. దమ్ముధైర్యంతో నిలబడిన!.. మా టైం వస్తుంది!.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టను..! కొడితే గూబ గుయ్ మనాలి..! పులివెందులలో కొట్టే దెబ్బ రాష్ట్రం మొత్తం వినపడాలి..! ప్రతి ఒక్కరూ ధైర్యంగా తిరగబడాలి..!! ఒక రెండు సంవత్సరాలు ఓపిక పట్టండి.. వచ్చేది జగన్ 2.0 అంటూ పులివెందుల వేదికగా వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ తరుణం మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల పర్యటన సందర్భంగా ఆయన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం చంద్రబాబు నేత్రుత్వంలోని అధికార కూటమి ప్రభుత్వంపై.. అలాగే కొంతమంది అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ధైర్యంగా తిరగబడాలని జగన్ పిలుపునిచ్చారు. ఓటింగ్ ప్రక్రియలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తూ.. ఓటింగ్‌కు ముందురోజు రాత్రే నేను పులివెందులకు వస్తా.. నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేస్తా. ఇప్పటికే షర్ట్ మడతబెట్టా.. ఎవరు వస్తారో రండి అంటూ ప్రత్యర్థులకు నేరుగా సవాల్ విసిరారు. ఏ ఒక్కరినీ వదిలేదని హెచ్చరించారు. పులివెందులలో అధికార కూటమికి దెబ్బ కొడితే రాష్ట్రం మొత్తం వినిపించాలి అని అన్నారు. అటు పాదయాత్రపై కూడా వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు.
పార్టీ కార్యకర్తలపై చెయ్యి పడితే చూస్తూ ఉరుకోనని జగన్ తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల వేళ చోటుచేసుకుంటున్న పరిణామాలు, దాడులపై జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తిరగబడాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ రోజు తాను పులివెందులలోనే ఉంటానని తెలిపారు. తాను అక్కడే ఓటు వేస్తానని.. ఎవరు దౌర్జన్యం చేసేందుకు వస్తారో రండి.. నేను చొక్కా మడత వేసే ఉన్నాను..ఎవరు రావాలనుకుంటున్నారో రండి.. అంటూ సవాల్ విసిరారు. పులివెందులలో కొట్టే దెబ్బ రాష్ట్రం మొత్తం వినిపించాలని పిలుపునిచ్చారు. తన పార్టీ కార్యకర్తలపై చెయ్యి వేస్తే తనపై వేసినట్లేనని స్పష్టం చేశారు. అధికార పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్క పోలీసు అధికారిని వదలను అంటూ హెచ్చరించారు.
అన్యాయం చేసిన ఏ అధికారిని కూడా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో తాను పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. తాను పులివెందుల ప్రజలతోనే ఏ కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా పంచుకుంటానని జగన్ తెలిపారు. జగన్ ఈ స్థాయికి వచ్చాడంటే అది పులివెందుల ప్రజల కారణంగానే అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తమను ఎన్నికల్లో ఎదుర్కునే ధైర్యం లేకనే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తమ పార్టీ మహిళలపైనా దాడులు చేశారని.. అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో వైసీపీ కష్టాలు ఎదుర్కొవడం కొత్తేమీ కాదని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతారని పేర్కొన్నారు. జగన్ పులివెందుల కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Also Read: