SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అయ్యప్ప భక్తులకు బిగ్ షాక్..స్వాములు రైల్లో పూజ చేస్తే భారీ ఫైన్..

Ayyappa Devotees big alert: శబరిమల యాత్రకు వారి సొంత రాష్ట్రం కేరళ, పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటకల నుంచి కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది భక్తులు అయ్యప్ప మాల ధరించి స్వామి దర్శనానికి వస్తుంటారు. ఎక్కువ మంది అయ్యప్ప స్వాములు రైల్లలో ప్రయాణం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అయ్యప్ప స్వాములకు రైల్లో పూజాలు చేయవద్దంటూ సర్కులర్ జారీ చేసింది. ఓ రకంగా అయ్యప్ప భక్తులకు ఇతని అశనిపాతమనే చెప్పాలి.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 23, 2026, 11:03 IST | Updated: Nov 23, 2026, 11:06 IST
Image Credit: Railway rules for ayyapaa devotees (Source/ZEE Media)
Join

Railway Department big Shock  to Ayyapaa Devotees: శబరిమల యాత్రకు అయ్యప్పలు తక్కువ ఖర్చులో సకల సౌకర్యాలతో వెళ్లే ఏకైక ప్రయాణ సాధనం రైలు. మెజారిటీ అయ్యప్ప భక్తులు రైళ్లలోనే శబరిమల దగ్గరలోని ఎర్నాకులం లేదా తిరువనంత పురంలో దిగి అక్కడ నుంచి  శబరిమలకు చేరుకుంటారు. తాజాగా రైల్లో వెళ్లే అయ్యప్ప భక్తులుకు రైల్వే శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. రైల్లో ఇంట్లో మాదిరి ఇరుముడికి దీపం పెట్టడం మరియు  కర్పూర హారతితో పూజాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.

కర్పూర హారతి వల్ల రైల్లలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం.. 
కర్పూర హారతి వల్ల రైల్లో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలున్నుందున ఈ నిర్ణయం తీసుకున్నారు.  అంతేకాదు అగరబత్తులు వెలిగించడం.. దీపాలు వెలిగించి పూజాలు చేయకూడదని చెప్పింది. ఇరుముడితో  పాటు పూజా సామాగ్రి తీసుకువెళ్లే విషయంలో ముందుగానే భక్తులు రైల్వే  శాఖకు సమాచారం అందించాలని సూచనలు చేసింది.

అగ్ని ప్రమాదాల నివారణకు కీలక ఆదేశాలు..

అసలు సిగరెట్ వెలిగించడం వలన పలు మార్లు రైళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. దీని వల్ల కొన్ని వందల మంది ప్రాణాలకు ప్రమాదంలో పడే అవకాశాలున్నందన ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ నేపథ్యంలో రైల్లలో ఎలాంటి అగ్ని సంబంధమైన పదార్ధాలను క్యారీ చేయవద్దని చెబుతుంటారు. ఒకవేళ చేసినా.. వాటిని ఉపయోగించకూడదు. రైల్లలో ముఖ్యంగా కిరోసిన్, పెట్రోల్, డీజిల్ వంటి వాటిని క్యారీ చేయడం నిషేధం. అయితే భక్తులకు మనోభావాలు మాకు ముఖ్యమైనవే. కానీ రైల్లో ప్రయాణించే ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అయ్యప్ప భక్తులు రైల్వే శాఖ సూచించిన సూచనలు పాటించాలని చెబుతుంది. ఇక అయ్యప్పలు , హిందూ సంఘాలు ఇది మత కోణంలో కాకుండా భద్రత పరమైన చర్యల్లో భాగంగానే పరిగణించాలి. లేకపోతే వేలాది ప్రాణాలు గాల్లో దీపంలా మారుతాయి. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES