• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /రోజురోజుకీ దిగొస్తున్న బంగారం ధరలు దేనికి సంకేతం.. 2 నెలలుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..

రోజురోజుకీ దిగొస్తున్న బంగారం ధరలు దేనికి సంకేతం.. 2 నెలలుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..

Gold prices are falling day by day: మార్కెట్లో బంగారం ధరలు వినియోగదారులను బెంబేలెతిస్తోంది. యేడాది ఆరంభంలో రికార్డు స్థాయి ధర పలికిన బంగారం ధరలు యేడాది అంతానికి క్రమంగా దిగొస్తున్నాయి. గత 11 నెలల్లో దాదాపు 60 వేల వరకు తగ్గింది పసిడి ధర. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,25,070 ఉంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 23, 2026, 11:40 IST|Updated: Nov 23, 2026, 11:45 IST
joinshare
రోజురోజుకీ దిగొస్తున్న బంగారం ధరలు దేనికి సంకేతం.. 2 నెలలుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..
Image Credit: gold Rates Declaine (Source/ZEE Telugu News)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రోజురోజుకీ దిగొస్తున్న బంగారం ధరలు దేనికి సంకేతం.. 2 నెలలుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..

రోజురోజుకీ దిగొస్తున్న బంగారం ధరలు దేనికి సంకేతం.. 2 నెలలుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..

2

Khammam: ఎల్లలు దాటిన ప్రేమ.. బ్రిటన్ యువతిని పెళ్లాడిన ఖమ్మం అబ్బాయి.. లవ్ స్టోరీ మాములుగా లేదుగా.!.

3

అయ్యప్ప భక్తులకు బిగ్ షాక్..స్వాములు రైల్లో పూజ చేస్తే భారీ ఫైన్..

4

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కీలక సూచన.. భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..

5

FASTag Deactivation: ఆన్ లైన్‌లో మీ FASTag అకౌంట్‌ను క్లోజ్ చేయడం ఎలా? పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gold Rates: గత రెండు నెలల వ్యవధిలోనే దాదాపుగా 30 శాతం ధర క్షీణించి కనిష్ట స్థాయికి చేరుకుంది. సెప్టెంబరు నెలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు  26వేల 450 మేర పతనమైంది. సెప్టెంబర్ 2026 ప్రారంభంలో ఒక లక్షా 52వేల  20 రూపాయలు వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర, వరుస తగ్గుదలతో నవంబర్ 20 తేదీ నాటికి ఒక లక్షా 25వేల570 రూపాయలకు చేరుకుంది. జనవరి 2026 నాటి ఆల్-టైమ్ రికార్డు స్థాయి ఒక లక్ష 78వేల 850 రూపాయలతో పోలిస్తే దాదాపు 30 శాతం తగ్గి, ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది.

బంగారం ధరలు.. 

సెప్టెంబర్  ప్రారంభంలో అపరంజి బంగారం పదిగ్రాములు ఒక లక్షా 52వేలతో 20రూపాయలతో అమ్ముడైంది. 22 క్యారెట్ల  ఆభరణాల బంగారం ఒక లక్షా 39వేల 350 రూపాయలతో అమ్ముడైంది. అక్కడ నుంచి రోజూ స్వల్ప ఒడిదుడుకులతో తగ్గుముఖం పట్టింది. అక్టోబర్  చివరి నాటికి అపరంజి బంగారం పది గ్రాముల ధర ఒక లక్షా 38వేల 481 రూపాయలతో విక్రయాలు జరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్షా 26వేల 849 రూపాయలతో అమ్మకం జరిగింది.     

11 నెలల్లో రూ.60 వేల వరకు తగ్గిన పసిడి..

నవంబర్  20వ తేదీనాటికి 10 గ్రాముల అపరంజి బంగారం ఒక లక్షా 25వేల 570 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఒక లక్షా 15వేల 110 రూపాయలకు చేరుకుంది. ఒక నవంబరు నెలలోనే పది గ్రాముల బంగారంపై20వేల రూపాయల తగ్గుదల కన్పించింది.

డిసెంబర్‌లో US Federal Reserve మళ్లీ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు బలపడటంతో ఇన్వెస్టర్లు బంగారం నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ 19 నెలల గరిష్ట స్థాయికి చేరడం, అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడి  పెరగడం వల్ల బంగారం ఆకర్షణ తగ్గింది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు  3,800 డాలర్లకు పడిపోవడంతో, ఫ్యూచర్స్ ట్రేడర్లు భారీగా అమ్మకాలకు దిగారు. అంతకు ముందు అధిక ధరల కారణంగా గ్రామీణ,  రిటైల్ కొనుగోలుదారులు కొనుగోళ్లను తగ్గించడం, పండుగల సీజన్ ముగియడం కూడా ధరలపై ఒత్తిడి తెచ్చింది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి సంబంధించిన కారణాలను పలువురు అనలిస్టులు చెబుతున్నారు.

14 నెలల కనిష్ఠ స్థాయికి బంగారం ధరలు.. 

పెళ్లిళ్ల సీజన్ సమయంలో బంగారం ఆభరణాల ధరలు 14 నెలల కనిష్టానికి రావడంతో కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. అయితే, కొనుగోలు చేసేటప్పుడు BIS హాల్‌మార్క్ తరుగు, మజూరీ ఛార్జీలను విడిగా సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం 24 క్యారెట్ల బంగారానికి ఒక లక్షా 25వేల  వద్ద బలమైన మద్దతు ఉందని చెబుతున్నారు. ఒకేసారి కాకుండా Gold ETF లేదా డిజిటల్ గోల్డ్ రూపంలో దశలవారీగా పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ ఒడిదుడుకుల నష్టాన్ని తగ్గించుకోవచ్చు మార్కెట్ అనలిస్టులు సూచిస్తున్నారు.


బంగారం ధర పతనం., గోల్డ్ లోన్ దారులకు షాక్..

అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఔన్సు  దాదాపు 28 గ్రాముల  బంగారం ధర 3,773 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. ఈ ఏడాది జనవరిలో గోల్డ్ ధరలు 10 గ్రాములకు  ఒక లక్ష 80వేల దగ్గర ఆల్ టైమ్ హై నమోదు చేసింది. 23 శాతం తగ్గుదలతో  ప్రస్తుతం పదిగ్రాముల బంగారం ధర ఒక లక్ష 33వేల నుంచి  ఒక లక్ష 37వేల రూపాయలు పలుకుతోంది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టుతుండటంతో తులం బంగారం ధర లక్ష రూపాలకు చేరుకునే అవకాశాలున్నాయని వినియోగదారులు భావిస్తున్నారు. నిజంగా బంగారం లక్షరూపాయలకు వచ్చే అవకాశం ఉందా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం కంటే అధిక రాబడినిచ్చే బాండ్ల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాటు  డాలర్ విలువ పెరగడం వల్ల ఇతర దేశాల కరెన్సీలలో బంగారం కొనుగోలు ఖరీదుగా మారింది. గ్లోబల్‌గా డిమాండ్ తగ్గింది. మార్కెట్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల సమయంలో ఆభరణాల కొనుగోలుపై పెట్టుబడులు మంచిదేనా? వినియోగదారులు మిన్నకుండిపోవడం మంచిదా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

సంవత్సర ఆరంభంలో రికార్డు స్థాయి ధర..

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగానూ బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి.  రెండు నెలలుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ వేళ ధరలు దిగిరావడం సామాన్య ఆభరణాల కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.  అయితే అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయంగా జీఎస్టీ, దిగుమతి సుంకాలు, రూపాయి మారకం విలువ ప్రభావం వల్ల తగ్గుదల కొంత భిన్నంగా ఉండవచ్చు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్   అంచనాల ప్రకారం, ఈ ఏడాది ధంతేరాస్–దీపావళి టైమ్‌లో గోల్డ్ నగల అమ్మకాల విలువ కిందటేడాదితో పోలిస్తే  15–25 శాతం పెరిగాయి. మరోవైపు, అమెరికా ఫెడ్ సమావేశపు మినిట్స్, ముడి చమురు ధరల కదలికల నేపథ్యంలో స్వల్పకాలంలో మరిన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో బంగారం బాగా పెరుగుతుందని అంచనాలతో  ఇప్పటికే బంగారం నగలు కొనుగోలు చేసి, భద్రపరచుకున్న వారు ఆందోళన చెందుతున్నారు.

బంగారం వెండి ధరలు పతనం.. 
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పతనమై ఏడాది కనిష్ట స్థాయికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  వెండి ధర దాదాపు 3 శాతం మేర క్షీణించి ఔన్సుకు  46 డాలర్ల స్థాయికి పడింది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కిలో వెండి ధర ఒక లక్ష85వేలకు దిగొచ్చింది. నవంబర్ 5 నుంచి ఇప్పటి వరకు కేవలం రెండు వారాల్లోనే కిలో వెండి ధర దాదాపు  25 వేల రూపాయల  మేర తగ్గింది.  అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే  భయాలతోనే వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. బంగారం వ్యాపార లావాదేవీలపై రిటైల్ వినియోగదారులు, ఆభరణాల కొనుగోలు దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

మరింత తగ్గితే బ్యాంకులకు పెరగనున్న రిస్క్..

బంగారం ధర పతనం., గోల్డ్ లోన్ దారులకు షాక్ ఇవ్వనున్న బ్యాంకులు.. అప్పు తీసుకున్న వాళ్లకు బ్యాంకుల మార్జిన్ కాల్స్, అదనపు బంగారం తాకట్టు పెట్టాలని చెబుతుంది. లేదంటే కొంత నగదు జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరింత తగ్గితే బ్యాంకులకు పెరగనున్న రిస్క్...వేలంతో పూర్తి రుణం రికవరీపై సందేహాలు నెలకొంటున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gold Rate
Silver Rate
Telugu News