• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Rajasthan Panchayat Polls: రాజస్థాన్‌లో కుప్పకూలిన బీజేపీ.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం

Rajasthan Panchayat Polls: రాజస్థాన్‌లో కుప్పకూలిన బీజేపీ.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం

Rajasthan Panchayat Elections: అధికారంలోని బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. రాజస్థాన్ గ్రామీణ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం దక్కగా.. కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అత్యధిక పంచాయతీ స్థానాలను దక్కించుకుని రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్‌ భారీ ముందడుగు వేసింది.

Written By Ravi Kumar Sargam
Published: Nov 21, 2026, 07:49 IST|Updated: Nov 21, 2026, 07:54 IST
joinshare
Rajasthan Panchayat Polls: రాజస్థాన్‌లో కుప్పకూలిన బీజేపీ.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం
Image Credit: Congress Party

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rajasthan Congress: అధికార లక్ష్యమే రాజస్థాన్‌లో అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ సంచలన ఫలితాలు నమోదు చేసింది. అధికార బీజేపీను గ్రామీణ ప్రాంతంలో తుడిచిపెట్టేసి అద్భుత ఫలితాలను సాధించింది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దారుణ ఫలితాలు చవిచూడగా.. కాంగ్రెస్‌ పార్టీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంది. బీజేపీ కంచుకోటలో హస్తం హవా కొనసాగించడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చేసింది.

రాజస్థాన్‌లోని 37 జిల్లాల్లో 419 పంచాయతీ సమితుల పరిధిలోని 475 జిల్లా పరిషత్ సభ్యులకు, 7543 వార్డులకు ఎన్నికలు నిర్వహించాయి. నాలుగు జిల్లాల ఫలితాలకు బ్రేక్‌ పడగా.. మిగిలిన వాటికి సంబంధించి ఫలితాలు వెల్లడించారు. 37 జిల్లా పరిషత్ స్థానాల్లో కాంగ్రెస్ 25 కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యం సాధించింది. బీజేపీ 8 స్థానాలకు పరిమితమవగా.. స్వతంత్రులు/ ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు. ఇక పంచాయతీ స్థానాల్లో మొత్తం 419లో కాంగ్రెస్ 213, బీజేపీ 85, స్వతంత్రులు 56 చోట్ల విజయం సాధించారు.

ప్రధాన జిల్లాలైన జైపూర్, జోధ్‌పూర్, బికనీర్, భిల్వారాలో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించగా.. బీజేపీకి కంచుకోటలుగా భావించే చిత్తర్‌గఢ్, సిరోహి, రాజ్ సమంద్, జలోర్ వంటి ప్రాంతాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ అనూహ్య ఫలితాలు సొంతం చేసుకుంది. ఇక బీజేపీ అజ్మేర్, ఉదయ్‌పూర్ ప్రాంతాలను మాత్రమే దక్కించుకుంది.

సీఎం, మంత్రుల కంచుకోటల్లో కాంగ్రెస్‌ హవా
ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం మిగిల్చింది. అధికారంలో ఉండీ కూడా దారుణ ఓటమిని మూటకట్టుకోవడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్ర మంత్రుల అడ్డాల్లో కూడా కాషాయ పార్టీ ఘోర ఫలితాలు ఎదుర్కొంది. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సొంత నియోజకవర్గం సంగనేర్‌లో పంచాయతీ సమితి స్థానాన్ని రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) సొంతం చేసుకుంది. ఇక ఆయన సొంత జిల్లా భరత్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నియోజకవర్గం జోధ్‌పూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ నియోజకవర్గం బికనీర్, భూపేంద్ర యాదవ్ నియోజకవర్గం అల్వార్‌లలో కూడా కాంగ్రెస్‌ చేతిలో బీజేపీ ఓడిపోయింది. రాజస్థాన్‌లో కీలక మంత్రిగా ఉన్న ఝబర్ సింగ్ ఖర్రా కుటుంబం మొత్తం ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయింది. పోటీలో నిలిచిన అతడి భార్య, ఇద్దరు కుమారులు ఘోరంగా ఓడిపోవగా.. యువ మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోర్ నియోజకవర్గం ఝోత్వారా పంచాయతీ సమితిలో కూడా బీజేపీ చేదు ఫలితాలు పొందగా.. ఒక్క సీటుకే పరిమితమైంది. ఇక ఆగిపోయిన నాలుగు జిల్లాల ఫలితాలను డిసెంబర్ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పాటు విడుదల చేయనున్నారు.

బీజేపీకి గట్టి దెబ్బ..
స్థానిక రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఫలితాలు పొందడానికి చాలా కారణాలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పని విధానంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓట్ బ్యాంక్ ఎస్సీ, జాట్, గుర్జర్, మీనా వర్గాలు భారీ మద్దతునిచ్చాయి. బీజేపీ సంప్రదాయ రాజ్‌పుత్ ఓట్ బ్యాంక్‌ కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూజీసీ అనేది గ్రామీణ ఫలితాల్లో తీవ్రంగా ప్రభావం చూపిందని తెలుస్తోంది.

జెడ్పీటీసీ ఫలితాలు
మొత్తం స్థానాలు: 1271
కాంగ్రెస్‌ పార్టీ: 794
బీజేపీ: 357
మిగిలిన స్థానాల్లో స్వతంత్రులు, ఇతర పార్టీలు

పంచాయతీ వార్డు సభ్యులు
మొత్తం స్థానాలు: 7520
కాంగ్రెస్‌ పార్టీ: 3,758
బీజేపీ: 2,213

Add Zee News as a Preferred Source
TAGS:
Politics
National News
Telugu News
Trending News
Congress