• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రాజ్యసభ వైపు రజనీకాంత్ సతీమణి లత అడుగులు..!

రాజ్యసభ వైపు రజనీకాంత్ సతీమణి లత అడుగులు..!

Rajinikanth Wife Latha Rajya Sabha: సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రాజ్యసభ కోసం ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి కోటాలో తనను రాజ్యసభ కు పంపించాలంటూ ఆమె కేంద్ర పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 09, 2026, 08:20 AM IST|Updated: Oct 09, 2026, 08:23 AM IST
joinshare
రాజ్యసభ వైపు రజనీకాంత్ సతీమణి లత అడుగులు..!
Image Credit: Latha nominated Rajya Sabha (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలంగాణ ప్రభుత్వంలో డిజిటల్ విప్లవం.. అధికారులకు  CS సంజయ్ జాజూ కీలక ఆదేశాలు..!

తెలంగాణ ప్రభుత్వంలో డిజిటల్ విప్లవం.. అధికారులకు CS సంజయ్ జాజూ కీలక ఆదేశాలు..!

2

Rajasthan: ఓర్నాయనో.. జైలర్ గా పనిచేసిన చోటే ఖైదీగా వెళ్లిన అధికారిణి.!. ఏంచేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్.!.

3

Comrade Kalyan Review: శ్రీవిష్ణు కామెడీ ఎలా ఉంది.. నవ్వించిందా.. నిరాశపరిచిందా?

4

నవపంచమ రాజయోగం ఎఫెక్ట్‌తో.. అక్టోబర్ 16 నుంచి ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే కాలమా?

5

బంగారు వాకిలి నుంచి దుర్గమ్మ దర్శనం.. ఏపీ ప్రభుత్వ వాట్సాప్ నంబర్‌తో 2 నిమిషాల్లో టికెట్! ధర ఎంతంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Latha Rajinikanth Will Nominated As Rajya Sabha: సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరంగేట్రం చేస్తాడని అభిమానులను ఊరించి ఊరించి ఉసురు మనిపించాడు. అదే సమయంలో డీఎంకే, ఏఐఏడీఎంకేలతో విసిగపోయిన ప్రజలు విజయ్ రూపంలో టీవీకే పార్టీ ప్రత్నామ్నాయంగా కనిపించడంతో విజయ్‌కు పట్టం కట్టారు. ఒకవేళ రజినీకాంత్ రాజకీయ ఆరంగేట్రం చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఓ రకంగా తమిళనాడులో ఎంజీఆర్, జయలలితల తర్వాత విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు రజినీకాంత్ రాజకీయాల్లో రావాలని ఉన్న చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. ఆయన రాజకీయాల్లోకి రాకున్నా.. ఆయన సతీమణి లతాకు రాజకీయాలపై ఆసక్తి ఉంది.

భవిష్యత్‌ రాజకీయాల్లో కీలకంపాత్ర పోషించనున్న రజినీకాంత్‌ ఫ్యాన్స్‌ .. 
లత రజినీకాంత్‌ను ఎలాగైనా రాజ్యసభ సభ్యురాలు కావాలనే కోరిక ఉందని తమిళనాడు సర్కిల్స్‌లో వినిపిస్తోన్న మాట. ఇప్పటికే లతా రజినీకాంత్ తరుపున కొంత మంది బీజేపీ సీనియర్ నేతలతో మంతనాలు సాగించినట్టు కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా   బీజేపీ సీనియర్‌ నేత , కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో  ఈ విషయమైన  చర్చించినట్లు తెలుస్తోంది.

కేంద్ర బీజేపీ పెద్దలతో మంతనాలు, త్వరలో అమిత్‌ షాతో భేటీ..


ఇక త్వరలో రాజ్యసభ సభ్యత్వం కోసం  కేంద్ర హోం మంత్రి పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న అమిత్‌షా తో కూడా ఈ విషయమై చర్చించనున్నట్టు తెలుస్తుంది. మరి బీజేపీ ఈ విషమంలో ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు  రాజకీయాల్లోకి రావాలని సన్నాహాలు చేసుకున్న రజనీ.. ఆఖరి నిముషంలో మనసు మార్చుకున్నారు.  

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు వెళ్ళాలని లత ప్రయత్నాలు..

అయితే ఇటీవల హీరో విజయ్ సీఎం కావడం, పలువురు నటీనటులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ కూడా ఉన్నట్టు టాక్‌ . ఇప్పటికే ఓ పార్టీ అనౌన్స్ చేస్తున్నట్టు ప్రకటించారు.  ఇందులో భాగంగా తనను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరుతూ ఆమె కేంద్రమంత్రులు రాజ్‌నాధ్ సింగ్, ప్రహ్లాద్ జోషి తదితరులతో మంతనాలు సాగించినట్లు తెలిసింది. మరి కేంద్ర పెద్దలు తమిళనాడులో పాగా వేయాలనే ప్లాన్‌లో భాగంగా రజినీకాంత్ ఫ్యాన్స్‌ను మచ్చిక చేసుకునేందుకు ఆమె సతీమణికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెడతారా లేదా అనేది చూడాలి. మరోవైపు రజినీకాంత్ ఫ్యాన్స్ విజయ్ పై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ ఫ్యాన్స్‌ను మచ్చిక చేసుకుంటే తమిళనాడులో పాగావేయవచ్చనే ప్లాన్‌లో భాగంగా రాజ్యసభ సీటును ఎరగా వేస్తున్నట్టు తెలుస్తుంది.  మరోవైపు రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో ‘జైలర్ 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
BJP
Amit Shah